భారతదేశం పురాతన నగరాలు | indian ancient cities
భారతదేశం పురాతన నగరాలు భారతదేశానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది . అలాగే మన దేశం లో అనేక పురాతనమైన నగరాలున్నాయి. సింధు నాగరికత నుంచే ఎంతో అద్భుతమైన నగరాలు కలిగిన మన దేశం లో ప్రస్తుతం ఇప్పటి నగరీకరణను తట్టుకొని కొన్ని కొన్ని నిలబడగా మరి కొన్ని చారిత్రక ఆనవాళ్లు గా మాత్రమే కనబడుతున్నాయి. ఇందులో అటువంటి కొన్ని నగరాల గురించి తెలుసుకుందాం. వారణాసి - దీనినే బనారస్ అని కూడా పిలుస్తారు . హిందువుల విశ్వాసం ప్రకారం ఇది ఎంతో పవిత్రమైన నగరం .ఇక్కడ ఉండే విశ్వనాథ్ దేవాలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది . 2014-2015 లో జరిగిన త్రవ్వకాల్లో ఇక్కడ 1800 (బి .సి. ఇ ) ప్రాంతం లోని వస్తువులు బయటపడ్డాయి . ఇక్కడ జరిగిన దండయాత్రలో భాగంగా ఆలయాలు కొంత వరకు దెబ్బ తిన్నాయని చెప్పవచ్చు . ఇక్కడే పతంజలి మహర్షి యోగ భాష్యాలను చెప్పరాని ప్రశస్తి . కాశి విశ్వేశ్వరు...