#VISHNUKUNDINULU #విష్ణుకుండినులు

                                                        విష్ణుకుండినులు 

శాతవాహనులు , ఇక్ష్వాకుల  తర్వాత మన తెలుగు ప్రాంతాలని రాజకీయంగా, సాంస్కృతిక  గొప్పగా పాలించిన వారిలో విష్ణుకుండినులు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు . వీరు క్రీ శ  350-540 సంవత్సరాల మధ్య పరిపాలించినట్టుగా తెలుస్తుంది. ఈ రాజ్య స్థాపకుడు ఇంద్రవర్మ .
ఈ రాజ్యం కృష్ణా ,గోదావరి నదుల మధ్యలో వెలసింది . అంటే ఇప్పటి తెలంగాణ లోని పాలమూరు , నల్లగొండ ,హైద్రాబాదు , మెదక్ ,కర్నూల్ ,గోదావరి ,కృష్ణా , నెల్లూరు ఈ ప్రాంతాలు ఈ రాజ్యం లో ఉన్నాయనేది చారిత్రక వాదుల అభిప్రాయం .

               
                   ఇంద్రవర్మ మొదటగా ఇంద్రపాల నగరం అనే రాజధానిగా ఏర్పాటు చేసి పాలించాడు .ప్రస్తుతం ఈ ఇంద్రపాల నగరం(తుమ్మల గూడెం ) అనే చారిత్రక నగరం నల్లగొండ జిల్లాలో ఉంది .ఇటీవలే వీరి శాసనాలు  హైదరాబాద్ నగరంలో త్రవ్వకాలలో భాగంగా బయటపడ్డాయి .
వీరి కాలంలో శైవం ,వైష్ణవం ,బౌద్ధం ,జైనం  వంటి ప్రాంతాలు విలసిల్లాయి .                  ప్రధానంగా  శ్రీశైలం ,ఉమామహేశ్వరం ,కొలనుపాక  లాంటి స్థలాలు శైవానికి ,                                శ్రీ పర్వతం , కొల్హాపూర్  వంటివి వైష్ణవానికి ,                                                                                కొలనుపాక , వేంగి,పఠాన్ చెరు,బెజవాడ   ప్రాంతాలు జైనానికి ,
గుంటుపల్లి ,నాగార్జునసాగర్ (శ్రీ  పర్వతం )   నల్లగొండ లోని చాలా ప్రాంతాలు బౌద్ధానికి ప్రసిధ్ధంగా ఉండేవని తెలుస్తుంది . 
   
                     విష్ణుకుండినులు అన్ని మతాలని సమానంగా చూసారని తెలుస్తుంది .వీరు ప్రధానంగా శ్రీ పర్వత స్వామీ భక్తులు గా ఉన్నారు .అనేక యాగాలు , క్రతువులని అనుసరించి నట్టుగా తెలుస్తుంది .

                     ఈ రాజ్యాన్ని ఇంద్రవర్మ స్థాపించిన మాధవ వర్మ కాలం లోనే పెక్కు పేరు ని సంపాదించి గా  తెలుస్తుంది .                                                                                                                          
  2వ మాధవ వర్మ  గొప్ప ధర్మ నిష్ఠ కలవాడిగా పేరు తప్పు చేస్తే తన సొంత కుమారుడని చూడకుండా అందరి ముందు శిక్ష వేసినట్టుగా పేరు ఉంది ,సుమారుగా  ఇంతకు 40-50 సంవత్సరాలు పరిపాలించినట్టుగా చారిత్ర కారులు అంచనా వేశారు . ఈయన తర్వాత వచ్చిన వారు ఎవ్వరు ఎక్కువ  కాలం  పరిపాలించలేదు . 2వ గోవిందుడి కుమారుడైన మాధవ వర్మ 3 కాలం లో కొంత మేర కాపాడుకోగలిగారు .

                    ఒకవైపు కళింగులు ,చాళిక్యుల ఆక్రమణలతో వీరి రాజ్యం పూర్తిగా అంతం ఐనది .
వీరి కాలం లోనే ఉండవల్లి గుహల నిర్మాణం జరిగింది , ఘటికాలు (సంస్కృత పాఠశాలలు ) ఎక్కువగా నిర్మాణం జరిగాయి . సామంత రాజుల వెన్నుపోటు మరియు 2వ పులకేశి సహాయం తో కుబ్జా విష్ణువర్ధనుడు వీరి రాజ్యంపై దాడి చేశాడు . ఈ యుద్ధం లోనే 3వ మాధవ వర్మ  ,మంచన  భట్టారక ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది .
 
                                ఉండవల్లి గుహలు వీరి కాలం లోనే నిర్మాణం జరిగాయి .














Comments

Popular posts from this blog

kanishka in telugu | కనిష్కుడు

buddhism in telugu | భౌద్ధమతం