Posts

Showing posts from November, 2020
జైన మతం తన ప్రాభవం ఎందుకు కోల్పోయింది ? చాలా మంది చరిత్రకారులు బౌద్ధ మతం మీద పెట్టిన శ్రద్ధ జైన మతం మీద అంతగా కనిపించలేదు. ఇక పొతే చాలా మంది ప్రజలకు జైన తీర్థంకరులకి , బుద్దుడికి కూడా అంతగా తేడా తెలియదు . వాస్తవానికి బౌద్దానికి పూర్వమే జైనం ఉనికిలో ఉంది . జనగామ ప్రాంతంలో 2200 సంవత్సరాల క్రితం నాటి జైన ధ్యాన గుహలు , తీర్థంకరుల శిల్పాలు మనం ఇప్పటికి చూడవచ్చు వరంగల్, కరీంనగర్ ,నిజామాబాద్ ప్రాంతాలతో పాటు తెలంగాణా లోని ఇతర ప్రాంతాలలో అన్వేషణల ఫలితంగా మనకు ఎంతో విలువైన సమాచారం లభ్యం కావడం జరిగింది .  చరిత్ర ప్రకారం తొలి శాతవాహనులు జైనులని శ్రీముఖుడి ముందు వరకు కూడా జైనాన్ని ఆచరించినట్లుగా అవగతం అవుతున్నది . ఆ తర్వాత ఆ పరంపరా తొలి కాకతీయుల వరకు కొనసాగింది . ప్రధానంగా  కల్యాణి , వేములవాడ చాళుఖ్యులు మరియు రాష్ట్రకూటులు జైన మతాన్ని పోషించారు . అనేక బసదులని , జైనారామాలని నిర్మించారని చెప్పవచ్చు.  ఇక చైనా యాత్రుకులైన హ్యుయాన్ గ్జాంగ్  , పాహియాన్ లాంటి వారి రచనలని బట్టి అప్పట్లో జైనం కూడా ప్రబలంగా ఉండేదని తెలుస్తుంది . ఆచార్య నయసేనుడి రచనలను బట్టి 11 వశతాబ్దం వరకు తెలుగు నేలపై జై...
Image
  తెలంగాణా లో జైన మతం జైనం తెలంగాణ లో ప్రాచూర్యం పొందిన మతాలలో ఒకటి షోడష మహాజనపదాల కాలం మునుపు నుంచి ఇక్కడ జైనం వెల్లువిలిసిందని తెలుస్తుంది. శాతవాహన రాజు సిరిముఖ కూడ ఈ మతాన్ని తన జీవిత భాగంలో ఆచరించినట్టు తెలుస్తుంది. ఇతనికి పూర్వం కూడ రాజులు ఆచరించి పోషించినప్పటికీ వారి వివరాలు పూర్తిగా తెలియవు. ఇక ఆ తర్వాత రాజులు కూడ జైనాన్ని ఆచరించడం , జినాలయాలని, బసది లని నిర్మించారని తెలుస్తుంది. చాళుక్యుల తర్వాత తొలి కాకతీయ రాజుల వరకు బ్రహ్మాండంగా వెలుగింది వీరశైవ వ్యాప్తి తో జైనం కనుమరుగు ఐనట్టు తెలుస్తుంది. తెలంగాణ లో ప్రధానంగా నేటి కరీంనగర్,నిజామాబాద్,మెదక్,వరంగల్,నల్గొండ తదితర ప్రాంతాల్లో చాలా ప్రభావవంతంగా జైనం వెల్లువిలిసింది మరియు పాలమూరు ,ఆదిలాబాద్ ,ఖమ్మం లో కూడా పురావస్తు అధికారులకు పలు ఆలయాల్లో జైన ఆరామాల ఆధారాలు లభించాయి. నేటి రాయలసీమలో అనంతపురం కర్నూల్ జిల్లాల్లో కూడా ఎక్కువగానే జైన మత అవశేషాలు లభించాయి . ప్రధానంగా #గంగాధర మండల ప్రాంతం లో నాడు జినవల్లభుడు అనే జైనముని ఉండేవాడు. ఈయనే బొమ్మలమ్మ గుట్ట మీద ఉన్న కుర్ఖ్యాల శాసనాన...