తెలంగాణా లో జైన మతం

జైనం తెలంగాణ లో ప్రాచూర్యం పొందిన మతాలలో ఒకటి షోడష మహాజనపదాల కాలం మునుపు నుంచి ఇక్కడ జైనం వెల్లువిలిసిందని తెలుస్తుంది. శాతవాహన రాజు సిరిముఖ కూడ ఈ మతాన్ని తన జీవిత భాగంలో ఆచరించినట్టు తెలుస్తుంది. ఇతనికి పూర్వం కూడ రాజులు ఆచరించి పోషించినప్పటికీ వారి వివరాలు పూర్తిగా తెలియవు.

ఇక ఆ తర్వాత రాజులు కూడ జైనాన్ని ఆచరించడం , జినాలయాలని, బసది లని నిర్మించారని తెలుస్తుంది. చాళుక్యుల తర్వాత తొలి కాకతీయ రాజుల వరకు బ్రహ్మాండంగా వెలుగింది వీరశైవ వ్యాప్తి తో జైనం కనుమరుగు ఐనట్టు తెలుస్తుంది.

తెలంగాణ లో ప్రధానంగా నేటి కరీంనగర్,నిజామాబాద్,మెదక్,వరంగల్,నల్గొండ తదితర ప్రాంతాల్లో చాలా ప్రభావవంతంగా జైనం వెల్లువిలిసింది మరియు పాలమూరు ,ఆదిలాబాద్ ,ఖమ్మం లో కూడా పురావస్తు అధికారులకు పలు ఆలయాల్లో జైన ఆరామాల ఆధారాలు లభించాయి. నేటి రాయలసీమలో అనంతపురం కర్నూల్ జిల్లాల్లో కూడా ఎక్కువగానే జైన మత అవశేషాలు లభించాయి .

ప్రధానంగా #గంగాధర మండల ప్రాంతం లో నాడు జినవల్లభుడు అనే జైనముని ఉండేవాడు. ఈయనే బొమ్మలమ్మ గుట్ట మీద ఉన్న కుర్ఖ్యాల శాసనాన్ని వేయించాడు. ఈ శాసనం సంస్కృతం, తెలుగు,కన్నడ భాషల్లో అప్పటి జినాలయాలను ,బసది, దాన ధర్మా లను గురించి తెలుపుతుంది.

గంగాధర ప్రాంతంలో #త్రిభువనతిలక అనే జైన ఆరామం మరియు బసదిలు ఉన్నాయి .అక్కడ పార్శ్వానాథ , మహావీర తీర్థంకర మూర్తులకు ఆరాధన జరిగేవని తెలుస్తుంది.

#రాపాక ప్రాంతం లో మరొ జైనారామాన్ని అరికెసరి-III నిర్మించాడు. దీనికై విజయుడు అనే వ్యక్తి భూమి దానం చేసినట్లుగా ఖలియవట్టు శాసనం ద్వారా తెలుస్తుంది.

#సనిగరం/శనిగరం లో 1051 ప్రాంతంలో దుద్దరాల జైన మందిరాన్ని యుద్దమల్లుడు నిర్మించినట్లుగా తెలుస్తుంది.

#కోరుట్ల లో రట్టమార్థండ జినాలయాన్ని రాష్ట్రకూటులు నిర్మించారు.

#వేములవాడ లో బద్దెగ-II శుభధామ జినాలయాన్ని నిర్మించాడు. ఎత్తైన పార్శ్వనాధ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది.

#జగిత్యాల లో విరకమల జినాలయం ఉన్నట్లుగా వరంగల్లు జిల్లా నర్సంపేట తాలూకా భానాజిపేట శాసనం (1082) ప్రకారం తెలుస్తుంది.

ఇక్కడ బసది ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి దీనిని కాకతీయ రాజైన ఒకటవ మేధరాజు నిర్మించాడు .
భోధన్ లో 56 అడుగుల ఎత్తైన బాహుబలి విగ్రహం ఉండేది. దీని ఆధారంగానే శ్రావణ బెలగొల లో భారీ బాహుబలి విగ్రహాన్ని చాముండరాయ ఏక శిలమీద చెక్కిన్చడం జరిగింది.

ఇంకా నాంపల్లి, పొట్లపల్లి,కాళేశ్వరం, యెల్లందు, ముల్కనురు ,తంగల్లపల్లి లో కూడా జైనం వెల్లువిలిసింది అనడానికి ఆధారాలు ఉన్నాయి.
- ఆధారాలు సోమదేవ సూరి రాసిన యసస్థిలిక చంపు గ్రంథం మరియు శాసనాల ఆధారంగా రాయడం జరిగినది.

తెలంగాణ లో ప్రధానంగా నేటి కరీంనగర్,నిజామాబాద్,మెదక్,వరంగల్,నల్గొండ తదితర ప్రాంతాల్లో జైనం వెల్లువిలిసింది .

వరంగల్ జిల్లా లొని అనుమకొండ మరియు పరిసర ప్రాంతాలు జైనానికి ప్రసిద్ది చాలుక్యుల అనంతరం మొదటి కాకతీయుల వరకు జైనాన్ని అవలంభించారు. కాగా అంతకు ముందునుంచే అక్కడి పరిసరాల్లో చాలా జైనారమాలు, బసదులు జైన యక్షిని దేవాలయాలు ఉండేవనీ తెలుస్తుంది.

వేంగి చాలుక్యుల చివరి పాలకుల సమయం లో గోదావరి జిల్లాల్లోని (పరిసర) జైనులు అనుమకొండ కి వచ్చారని తెలుస్తుంది. ఇక్కడ ఇప్పడికి కూడా పద్మాక్షి జైన యక్షిని దేవాలయాన్ని చూడవచ్చు. కొండ మీద చెక్కిన తీర్థంకరుల రూపాలు ఇప్పటికి ఉన్నాయి.
అనుమకొండ , జనగామ,బోధన్ లో శాతవాహనుల పూర్వం నుంచే జైనం వెల్లువిలిసిందని చెప్పవచ్చు.

Comments

Popular posts from this blog

kanishka in telugu | కనిష్కుడు

buddhism in telugu | భౌద్ధమతం