Posts

Showing posts from March, 2022

#Aryan_invansion ఆర్యుల దండయాత్ర

#ఆర్యుల_దండయాత్ర_జరిగిందా_లేదా? ఈ ప్రశ్న అడగగానే ఒక భావజాలం వారు ఆ జరగలేదని, మరో వర్గం జరిగిందని చెబుతుంటారు. ఇప్పుడు వాస్తవ దర్శనం చేద్దాం --- ఆర్యుల రాక జరిగిన మాట వాస్తవం అందులో ఏ విధమైన దోషం లేదు. చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వీరివల్లే వర్ణ వ్యవస్థ వచ్చినది అని చెబుతారు. మరీ ఆర్యుల మాతృ ప్రాంతంగా ఊహించబడే జర్మనీ, ఇరాన్, సైబీరియా, మద్య ఆసియా ఇలా చాలా ప్రాంతాల మూల నాగరికత ల్లో వర్ణ వ్యవస్థ ఉన్నట్లు కనబడదు. అంటే ఆర్యులు ఇక్కడికి వచ్చాకే మలి వేద నాగరికత కాలం లో ఈ జాడ్యం మరింత పెరిగిందని మనం చూడాల్సిన విషయం. #ఉత్తరభారతీయులందరూ_ఆర్యులనా? చాలా మంది ఉత్తర భారతీయులందరిని ఆర్యులని దక్షిణ ప్రాంతం లోని వారిని ద్రావిడులుగా పరిగణించడం కూడా తప్పే. ఎందుకంటే ఆర్యులు ముందుగా ప్రస్తుత పాకిస్తాన్, ఆఫ్ఘన్ లోని కొన్ని ప్రాంతాల నుంచి మొదలు పెడితే పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, దైమాబాద్ (మహారాష్ట్ర) వరకు స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారని తెలుస్తుంది. అంటే ఇప్పటి పాకిస్తాన్, భారత్ లోని వాయువ్య భాగాల్లొని వి వీరి యొక్క మెజారిటీ ప్రాంతాలు. ఐతే చాలా వరకు వీరి అప్పటి ...