#Aryan_invansion ఆర్యుల దండయాత్ర

#ఆర్యుల_దండయాత్ర_జరిగిందా_లేదా? ఈ ప్రశ్న అడగగానే ఒక భావజాలం వారు ఆ జరగలేదని, మరో వర్గం జరిగిందని చెబుతుంటారు. ఇప్పుడు వాస్తవ దర్శనం చేద్దాం --- ఆర్యుల రాక జరిగిన మాట వాస్తవం అందులో ఏ విధమైన దోషం లేదు. చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వీరివల్లే వర్ణ వ్యవస్థ వచ్చినది అని చెబుతారు. మరీ ఆర్యుల మాతృ ప్రాంతంగా ఊహించబడే జర్మనీ, ఇరాన్, సైబీరియా, మద్య ఆసియా ఇలా చాలా ప్రాంతాల మూల నాగరికత ల్లో వర్ణ వ్యవస్థ ఉన్నట్లు కనబడదు. అంటే ఆర్యులు ఇక్కడికి వచ్చాకే మలి వేద నాగరికత కాలం లో ఈ జాడ్యం మరింత పెరిగిందని మనం చూడాల్సిన విషయం. #ఉత్తరభారతీయులందరూ_ఆర్యులనా? చాలా మంది ఉత్తర భారతీయులందరిని ఆర్యులని దక్షిణ ప్రాంతం లోని వారిని ద్రావిడులుగా పరిగణించడం కూడా తప్పే. ఎందుకంటే ఆర్యులు ముందుగా ప్రస్తుత పాకిస్తాన్, ఆఫ్ఘన్ లోని కొన్ని ప్రాంతాల నుంచి మొదలు పెడితే పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, దైమాబాద్ (మహారాష్ట్ర) వరకు స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారని తెలుస్తుంది. అంటే ఇప్పటి పాకిస్తాన్, భారత్ లోని వాయువ్య భాగాల్లొని వి వీరి యొక్క మెజారిటీ ప్రాంతాలు. ఐతే చాలా వరకు వీరి అప్పటి కొంత వరకు ఉన్న ప్రాబల్యాన్ని పెద్దగా చేసి చూపడం మన పొరపాటే... #ఆర్యులు_రాక_మునుపు_అంతా_ద్రావిడమయమేనా? ఇది కూడా అవాస్తవమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్యులు రాక పూర్వమే నవీన శిలా యుగ పూర్వమే మానవ వలసలు పెచ్చుమీరాయని చెబుతారు. పశువుల వేటకి పదునైనా ఆయుధాలు సమకూరడం , జనాభా పెరగడం తో అప్పటి పోటీ వలసల వల్ల అనేక ప్రాంతాలకి వెళ్లారు. నిగ్రీటోలు- వీరు దేశం లోకి మొదటగా వచ్చిన జాతి వీరు ఎక్కువగా అండమాన్, నికోబార్, కేరళ వంటి ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరు మడగాస్కర్ నుంచి వలస వచ్చినట్లు భావించవచ్చు. ప్రొటో ఆస్టలాయిడ్స్ : దక్షిణ ప్రాంత అరణ్యాల తో పాటు పడమటి పాకిస్తాన్ లో ఉన్న తెగ. బహుశా వీరినే యక్షులని పిలిచి ఉండవచ్చు. ఎందుకంటే వీరి జీవన విధానానికి, యక్షులకి ఎంతో సారూప్యం గోచరిస్తుంది. మంగో లాయిడ్స్: వీరిని చూసి మనం అందరం చైనా వారే అనుకుంటాం . కాని వీరు మన దేశస్తులే ఎక్కువగా ఈశాన్య భారతం,ప్రస్తుత బెంగాల్, ఒడియా, మయన్మార్ లో విస్తరించారు. మెడిటెరియన్లు / ద్రావిడ తెగ -- వీరు నీగ్రిటో, ప్రొటో ఆస్టలాయిడ్స్ తరువాత వలస వచ్చిన జాతి వీరు గంగా, బ్రహ్మపుత్ర, సిందూ, మరియు ఉత్తర, వాయువ్య భారతం లోని ప్రాంతాలోని వారు. ఆర్యుల తెగ తో పొరాడిన వారిగా చెప్పుకోవచ్చు. నార్డిక్ తెగ/ ఆర్యుల తెగ -- వీరినే మనం ఆర్యులు అని పిలుస్తాం. వీరు చివరిగా వలస వచ్చిన వారు. #మరి_నాగులు_ఎక్కడి_వారు? మత పరంగా , సాంప్రదాయం లో ఎంతో ముందు నిలించింది వీరే ఐతే వీరు ఈ అనేక తెగలు కలిసి ఏర్పడిన (సాంకర్యం వల్ల) వర్గం గా చెబుతారు. కొంత మంది వీరిని ద్రావిడులుగా భావిస్తారు . ఒక వేళ ఇదే నిజం ఐతే నాగ సాంప్రదాయం ఇక్కడే ఉండాలి. కాని ఏక కాలం లో వీరికి సంబందం లేని ప్రాంతాల్లో కూడా వీరి ఆచారాల శిథిలాలు లభించాయి. కాబట్టి చాలా మంది వీరిని కొన్ని జాతుల సాంకర్యం వల్ల ఏర్పడిన మరో జాతిగా చెబుతారు. #మరి_ఇన్ని_జాతుల_మద్య_సాంకర్యం_జరగలేదా? కేవలం 400 సంవత్సరాల కాలం లో పోర్చుగీసు, వారికి గోవా లోని మహిళలను వివాహం చేసుకున్నారు . వారి వారసులు ఉమ్మడి లక్షణాలతో మనకి కనబడుతున్నారు. అచ్చు ఇలాగే పుదుచ్చేరి లో ప్రేంచి వారికి తమిళుల సాంకర్యం కూడా జరిగింది. ఇంకా చెప్పాలంటే విదేశీయులైన కుశానులకి ఇక్కడి వారికి గుప్తులకి వాకటకులకి, మొఘలులకు రాజపుత్ర వంశాలకు మొదలుకుంటే సాధారణ వ్యక్తుల నడుమ కూడా జరిగింది. ఇలా పూర్వ కాలం నుంచి అనేక జాతులకు , భాషలకు , వర్గాలకు సంకరం జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది......

Comments

Popular posts from this blog

kanishka in telugu | కనిష్కుడు

buddhism in telugu | భౌద్ధమతం