buddhism in telugu | భౌద్ధమతం

                                                               భౌద్ధమతం
అప్పటి కాలంలో ఉన్న మూఢనమ్మకాలకు , మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఒక సామజిక ఉద్యమం వలే వచ్చిన మతమే బౌద్ధం . ఈ మతాన్ని గౌతముడు (సిద్ధార్థుడు ) నెలకొల్పాడు . ఇతడు మహా వీరునికి సమకాలికునిగా చెప్పవచ్చు 563-483 మధ్య ప్రాంతాన్ని సంబందించిన వాడు .
                            ఇతడు క్షత్రియ వశస్థుడైన శాక్యులకు అధిపతి ఐనా శుద్దోధనునికి ,మాయ దేవి కి జన్మిచాడు . పుట్టిన కొన్ని రోజులకే తల్లి మరణించుటచే ప్రజాపతి గౌతమి పెంచింది . అందువల్లే ఇతనిని గౌతమ బుద్ధుడు అని పిలుస్తారు . ఇతనికి 19 సంవత్సరాల వయస్సులో దగ్గరి బంధువు మరియు రా కుమారి ఐనా యశోధర తో వివాహం జరిగింది.ఇతనికి  రాహులుడు అనే పుత్రుడు జన్మిచాడు .  ఇతని జీవితం లో జరిగిన సంఘటనల వాళ్ళ విసుగు చెంది 29 సం .ల వయస్సులో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు . ఇతనితో పైన తండ్రి కుమారుడైన దేవలుడు చిన్న వయసు నుంచే ప్రతి విషయంలో గొడవ పడేవాడు .
                            బుద్ధుడు ఇంటి నుంచి వెళ్లిపోవ దాన్ని మహాహాభినిష్క్రమణం గ పిలుస్తాము . చెన్నకేతు సహాయంతో కంటక అనే గుర్రం మీద వచ్చిన గౌతముడు చెన్నకేతు కు తాను వెళ్ళిపోతున్నానని తన తండ్రికి బంధు జనానికి ఈ విషయాన్ని తెలియజేయమని  చెబుతాడు .
ఆ తర్వాత ఎన్నో రాజ్యాలు తిరుగుతూ దుఖ్ఖ విమోచన ఉపాయాలను మరియా పద్దతులను తెలుసుకోవడానికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు . మొదటగా పాటలీపుత్ర నగరం లో పర్యటిస్తుండగా రా కుమారుడు సన్యాసం తీసుకున్నట్టుగా తెలుసుకున్న మగధ రాజు బింబిసారుడు  చలించిపోయాడు . బుద్ధుడిని  చర్చించడాని పిలిపించాడు దీనికి గాను బుద్ధుడు తర్వాత సమావేశం అవుదాం అంటూ తిరస్కరించడము జరిగింది . ఎందుకంటే సన్యాసం తీసుకున్న వాడు రాజు ఇచ్చే విందు లో పాల్గొనడం గౌతమునికి ఇబ్బంది కలిగించే అంశం కావున .
                          తరువాత రుద్రక ,అలాకారమా  అనే గురువుల వద్దకు వెళ్లిన గౌతముడు . వారి వద్ద శిష్యరికన్నీ చేశారు . కానీ అది బుద్ధునికి సంతృప్తి ని ఇవ్వలేదు . వెంటనే అతడు మరొక ప్రాంతానికి వెళ్లి ఉపవాసం ఉంది నియమ నిష్ఠలతో తపస్సు చేసినా అది దుఖ్ఖ విమోచనం గ ఆయనకు అనిపించలేదు . ఐతే ఒకనాడు తిండిలేక సొమ్మసిల్లి పడిపోయిన అతన్ని స్థానిక దండనాయక కుమార్తె సుజాత  ఆహారం ఇచ్చి బుద్ధుడి ప్రాణాలను కాపాడింది .
                          ఇక ఇలా ఉపవాసం ఉండి జ్ఞానాన్ని పొందడం అసాధ్యం అనుకున్నాడు . క్రమేణా అతడు నియమిత ఆహారాన్ని తీసుకోవడం మొదలు పెట్టాడు ఇదంతా చుసిన అతని సహచరులు సన్యాసిగా   గౌతముడు ఉండలేదని అనుకున్నారు . ఇలా చాలా మంది తో చాలా ప్రదేశాలలో పర్యటించిన గౌతముడు ఇక నిరంజనా నది ఒడ్డున తన ధ్యానాన్ని మొదలుపెట్టి  49 వ రోజు   విశాఖ శుద్ధ పౌర్ణమి రోజు జ్ఞానోదయాన్ని పొందాడు . ఇక దుఖ విమోచనాని కనుగొన్న గౌతముడు బుద్ధునిగా పిలవబడ్డాడు . తాను కనుగొన్న విషయాలను గురువులకు చెబుదామనుకున్న బుద్ధుడు (అలక ఆరామ,రుద్రక ) వారు లేరని తెలుసుకొని . తన సహచరులైన 5 మంది సహచరులకు  జ్ఞానాన్ని వివరించాక వారు బుద్ధుడిని తమ గురువుగా అంగీకరించారు , ఇలా వారికి తెలిపిన జ్ఞానాన్ని ధర్మచక్రం పరివర్తనగా పిలుస్తారు .
   
                            చాలా మంది బుద్ధుని  ప్రబోధాలకు , తన సిద్ధాంతాలకు నచ్చి బౌధ్హాన్ని స్వీకరించారు . ఇలా ప్రజలు నిమ్న వర్గాలవారికి గౌరవమిచ్చాడు , కుల వ్యవస్థను వ్యతిరేకించాడు, మూఢనమ్మకాలకు జంతు బలులను వ్యతిరేకించాడు . మంగలి ఐనా ఉపాలి కి     రహ దారులను ఊడ్చే  నవనీతుడు కి బిక్షువును ఇచ్చి అందరిని సమంగా చూసే విషయాన్ని లోకానికి చాటి చెప్పారు. సంస్కృత బాషా ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు . ఆ ప్రాంత ప్రజల భాష ఐనా పాళీ లోనే భోదించాడు .
                   ఆ సమయంలో చాలామంది ప్రజలు , రాజులు , రాణులు బుద్ధుని బోధనలకు ఎంతగానో ఆకర్షితులయ్యారు .చాలా మంది భిక్షువులు  ప్రజల భాషలో బోధనలు చేశారు . అందువల్ల స్థానిక భాషల్లో కుడి తొలిసారిగా చెప్పడం వాళ్ళ ఆ కాలంలో చాలా మంది బౌద్ధాన్ని పుచ్చుకున్నారు . దేవుడు లేదని వాస్తవాన్ని వాస్తవ దృష్టితో చూడాలని చెప్పారు . రాజా నర్తకి ఐనా ఆమ్రపాలి కి భిక్షు అర్హతను ఇచ్చారు . సమాజంలో స్త్రీ లకు కూడా సముచిత స్థానాన్ని కల్పించారు .
                బౌధ్హ సంఘాలను నెలకొలపాడు . నిబంధనలను కూడా విధించాడు . కొలీయులకు ,శక్యులకు జరిగిన నీటి తగాదాలను నిలువరించారు . శిష్య బృందం లోని అందరిమాటకు  బుద్ధుడు విలువ ఇచ్చేవాడు . ఈ విధానంగానే ఆనందుని మాట ప్రకారమే మహిళా భిక్షు సంఘాలని ఏర్పాటు చేసాడు . తండ్రి మాటకు విలువ ఇచ్చి 20 ఎల్లా తర్వాతే బిక్షువులుగా తీసుకోవాలని నిర్ణయించాడు .     
                   దేవలుడు మాత్రం బుద్ధునికి ఉన్న ప్రజా ధారణను చూసి సహించలేకపోయారు . నిండు  సమావేశంలో ఒక మహిళతో గర్భిణీ వేషం వేయించి అది విఫలమై  . అందరి చేత దూషించబడ్డడు . ఈ ఘట్టం గురించి జయమంగళ అట్ట  గాధలలో వివరించబడింది . అంగుళిమాలుడిని కూడా తన బుద్ధి బలం తో మార్చాడు . తన పరాక్రమం తో మారుడుని జయించాడు . ఒకనాడు దేవలుడు బుద్ధుడిని  లేకుండాచేయాలనే ఉద్దేశం తో బుద్ధుడు బిక్ష తీసుకునే సమయంలో ఏనుగు ను రెచ్చగొట్టాడు .  అది బుద్ధుడు ని చూసి దాడి చేయకుండా ఆగిపోయింది . కానీ చివరిదశలో దేవలుడు తాను చేసిన తప్పులను చెప్పుకొని తీవ్ర అస్వస్థతో మరణించాడు . కానీ బుద్ధుడు మాత్రం తన సోదరుణ్ణి తప్పు చేసిన ప్రతిసారి క్షమించేవాడు . కొన్ని సార్లు అతన్ని సంఘం నుంచి బహిష్కరించిన అతడు మాత్రం మారలేదు.
.               
                ముఖ్యంగా అశోకుడు , కనిష్కుడు ,బింబిసారుడు ,ఇంకా సింహళ రాజులు బోద్ధాన్ని స్వీకరించి జనరంజక పాలనను చేశారు . ఇక తన 80 వ ఏటా ఖుషి నగరం లో వైశాఖ పౌర్ణమి రోజు న నిర్యాణం చెందారు . బుద్ధుని జ్ఞాపకార్థంగా స్థూపాలను నిర్మిస్తారు.   ఇవి చాల రకాలు ఉంటాయి . మన దేశములో  ముఖ్యంగా సాంచి , సారనాధ్ , అమరావతి ,దూళికట్ట వంటి స్థాహూపాలు ముఖ్యవేయినవి .
                         శ్రీలంక , ఇండియాసియా , టిబెట్, చైనా, థాయిలాండ్, కంబోడియా. మలేసియా , మంగోలియా లాంటి చల్ ఆసియా దేశాలకు బౌద్ధం విస్తృతం అయింది . ఇక త్రిపిటక వీరి పవిత్ర గ్రంథం .త్రిపిటక అనగా మూడు బుట్టలు అని అర్థం అప్పటి ప్రజలను , కూలీలు బుట్టలను వినియోగించేవారు అందువల్ల వీటికి అవే  పేర్లను పెట్టారు . త్రిపిటకాలు మూడు అవి  1)వినయ పీఠికా
2)సుత్తపీఠికా
3)అభి ధమ్మా పీఠిక

 ధమ్మపదం లో  బుద్ధుడు చెప్పిన ఎన్నో విషయాలు  ఉన్నాయి .
               అప్పటికాలానికి సంబంధించి  ఎన్నో  ముఖ్య విశ్వవిద్యాలయాలు వీరికి సంబంధించినవే  వాటిలో ముఖ్యమైనవి నలంద ,తక్షశిల , నాగార్జున కొండా , ఫణిగిరి, అమరావతి , గాంధార ప్రాంతాల్లో చల్ల కేంద్రాల్లో విశ్వవిద్యాలయాలు నిర్మించాడ్డాయి . ఆయుర్వేద , న్యాయ , భస్మ , వైద్య  , తత్వ శాస్త్రాలను ఈ విద్యాలయాల్లో బోధించే వారు .
                ఐతే బౌద్ధం  ఆయా బౌద్ధ సంగీతి సమావేశాల్లో కొన్ని శాఖలుగా విడిపోయాయి . అవి మహాయాన , హీనయాన , వజ్రయాన  శాఖలుగా విడిపోయింది . ఎన్ని శాఖలు గ వీడినప్పటి ధ్యానం , బుద్ధుడుచుపిన మార్గమే వీరందరికి మార్గదర్శకం .

బుద్ధుడు తన బోధనల ఆధారంగా ఆర్య సిద్ధాంతాలను కూడా విస్తృతంగా ప్రతిపాదించడం జరిగింది .

1.ప్రపంచం దుక్ఖమయం
2.దుక్ఖానికి కారణం కోరికలు
3.దుఖాన్ని జయించాలన్న కోరికలను జయించాలి .
4. కోరికలను జయించాలన్న అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి .


                                                        అష్టాంగమార్గం 
బుద్ధుడు అష్టాంగమార్గాలను ప్రతిపండించడం జరిగింది .

1. సమ్యక్ వాక్కు
2.  సమ్యక్ క్రియ
3.  సమ్యక్ జ్ఞానం
4.  సమ్యక్ ద్రుష్టి
5.  సమ్యక్ ఆలోచన
6.  సమ్యక్ ధ్యానం
7.  సమ్యక్ నిశ్చయం
8.  సమ్యక్ శ్రమ

ఈమార్గాలను అనుసరించి దుఃఖాన్ని ప్రాలదోరవచ్చు అని వివరించారు .

గౌతమ బుద్ధుని చిహ్నాలు .

* బుద్ధుని జన్మస్థలాన్ని సూచించేది - తామర
* బుద్ధుని మహాభినిష్క్రమణ              -గుర్రం
* బుద్ధుని జ్ఞానోదయం                         -చక్రం
* బుద్ధుని మరణం                               - స్థూపం

 
                 అమరావతి స్థూపం                                            ఇండోనేసియా బోరోబాదూర్ స్థూపం

శ్రీ లంక లో బౌద్ధ విగ్రహం                                       చైనా లోని  బౌద్ధారామం లో
                                                                                 







Comments

Post a Comment

Popular posts from this blog

kanishka in telugu | కనిష్కుడు