యక్షులు ఎవరు ?

 మన దేశం ఎన్నో వేల సంవత్సరాల చరిత్రను తనలో ఇముడ్చుకున్నది . పురాతన భారాతావనిలో కూడా కొన్ని గణాల గురించి  పురాతన  గ్రంథాల్లో చెప్పబడి ఉన్నది . 

సప్త గణాలు - ఋషులు , గంధర్వులు , నాగులు,అప్సరసలు , యక్షులు,దేవతలు మరియు రాక్షసులు  

చాలా పురాణాల్లో యక్షులను దట్టమైన అరణ్యాలలో ,నదుల,సరస్సుల ప్రవాహక ప్రాంతాల్లోనో , లోయల ప్రాంతాల్లో ఉండేవారని చెబుతున్నాయి. వారు మంచి శరీర పుష్టి కలిగి అందంగా ఉండేవారని తెలుస్తుంది . వీరి గురించి హిందూ , జైన ,బౌద్ధ మత సాహిత్యాల్లో కూడా చెప్పబడి ఉంది . యక్షుల రాజు కుబేరుడు ఈయన సంపదకు ప్రభువుగానూ ,శివుడిని యక్షమూర్తి గాను కొన్ని గ్రంథాలు తెలుపుతున్నాయి . వేదాలలో కూడా యక్షుల ప్రస్తావన ఉన్నది . యక్షులు  రక్షకులుగానూ మరియు భక్షకుల గానూ కొన్ని గ్రంథాల్లో ఉంది . పురుషులను  యక్షుడు అని స్త్రీ లని యక్షిని లు అని పిలుస్తారు .  సంస్కృతం లో యక్షులు అని , పాళీ భాష లో యక్ఖ  లుగా పిలుస్తారు . ప్రముఖంగా వీరు అప్పటి కాలంలో సాహిత్య పరంగా , ఆధ్యాత్మికంగా ఆయా సాహిత్యాల్లో గొప్ప స్థానాన్ని ఆక్రమించారు . వీరు గొప్ప కళాపోషకులు గా కనబడతారు.  

హిందూ మతం లో యక్షులు - యక్ష కన్యలు , రాజుల గురించి ఉంది ప్రధానంగా మహాభారతం లో భీముడు , ధర్మరాజు లను ఒక యక్షుడు ప్రశ్నలను అడగటం వీటినే యక్ష ప్రశ్నలు అని పిలుస్తారు .కర్ణాటక తో పాటు తెలంగాణా ప్రాంతాల్లో ఇప్పటికి యక్ష గాణాలు జరుగుతూ ఉంటాయి .ఇందులో శివుడు ,పార్వతి తో పాటుగా ఆయా గ్రామ దేవతల గురించి కళాకారులు పాడుతూ ఉంటారు . శ్రీ లంకను ఏలే యక్షుడైన కుబేరుడిని ఓడించి రావణుడు గెలవడం .                      


జైన మతంలో యక్షులు -  జైన మతం ప్రకారం 24 యక్ష, యక్షీణి దేవతలు ఉన్నారు .ప్రధానంగా శ్వేతంబర జైనంలో యక్షిణి ల ప్రస్తావన ఉంది . ప్రముఖ జైన గ్రంథం హరివంశ పురాణం లో యక్షిణి దేవతలు శాసన దేవతలుగా కూడా    దేవతలుగా పేర్కొనబడ్డారు .  జైన మతంలో ప్రధాన యక్షులు విజయ , కింపురుష ,మణిభధ్ర(రాణి బాహు పుత్రిక ) , బ్రహ్మశ్వర , అజిత , పాతాళ 

శాసన దేవతలు మరియు యక్షిణీలు - పద్మాక్షి , చక్రీశ్వరి , అంబికా , కూష్మాండిని  పూర్ణభద్ర , బహు పుత్రిక . 

దిగంబర జైనం లో  దిగంబర యక్ష  ప్రతిమలను మనం చూడవచ్చు .                                       

                                                                    గోముఖ యక్ష 

బౌద్ధ మతంలో యక్షులు - బౌద్ధ మతంలో యక్ఖలు గా సంబోధించారు . బౌద్ధం తూర్పు ఆసియా , ఆగ్నేయ ఆసియాలకు విస్తరించడం వల్ల  యక్షలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది . బౌద్ధ విహారాలలో యాక్ఖుల ప్రతిమలు కూడా గౌరవనీయ స్థానాలను పొందాయి . టిబెటన్ బౌద్ధం లో కుబేరుడికి విశిష్ట స్థానము ఉంది .మహా వంశ గ్రంథం లో కూడా శ్రీ లంక లోని యక్షుల గురించి తెలుపబడింది. చైనా ,థాయ్ లాండ్ లలోని ఆరామాల్లో యక్షుల కి స్థానం కల్పించారు . 

                                    


బౌద్ధ  మతంలోని కొన్ని యక్షుల పేర్లు - అనిల , ఇందల , కుబేర , చిదల , మహల . 


Comments

Post a Comment

Popular posts from this blog

kanishka in telugu | కనిష్కుడు

buddhism in telugu | భౌద్ధమతం