యక్షులు ఎవరు ? మన దేశం ఎన్నో వేల సంవత్సరాల చరిత్రను తనలో ఇముడ్చుకున్నది . పురాతన భారాతావనిలో కూడా కొన్ని గణాల గురించి పురాతన గ్రంథాల్లో చెప్పబడి ఉన్నది . సప్త గణాలు - ఋషులు , గంధర్వులు , నాగులు,అప్సరసలు , యక్షులు,దేవతలు మరియు రాక్షసులు చాలా పురాణాల్లో యక్షులను దట్టమైన అరణ్యాలలో ,నదుల,సరస్సుల ప్రవాహక ప్రాంతాల్లోనో , లోయల ప్రాంతాల్లో ఉండేవారని చెబుతున్నాయి. వారు మంచి శరీర పుష్టి కలిగి అందంగా ఉండేవారని తెలుస్తుంది . వీరి గురించి హిందూ , జైన ,బౌద్ధ మత సాహిత్యాల్లో కూడా చెప్పబడి ఉంది . యక్షుల రాజు కుబేరుడు ఈయన సంపదకు ప్రభువుగానూ ,శివుడిని యక్షమూర్తి గాను కొన్ని గ్రంథాలు తెలుపుతున్నాయి . వేదాలలో కూడా యక్షుల ప్రస్తావన ఉన్నది . యక్షులు రక్షకులుగానూ మరియు భక్షకుల గానూ కొన్ని గ్రంథాల్లో ఉంది . పురుషులను యక్షుడు అని స్త్రీ లని యక్షిని లు అని పిలుస్తారు . సంస్కృతం ల...