NAGAS / నాగులు ఎవరు?

                                                         నాగులు ఎవరు?

                 మనదేశ చరిత్ర అత్యంత పురాతనమైనది. ఆదిమ మానవులు ప్రకృతి ని ఓ శక్తి నడిపిస్తుందని ఆ శక్తియే దైవం అని తలచారు. ఆ సమయాల్లో  అగ్ని,వాయు,వరుణ, సూర్య వంటి ప్రకృతి శక్తులన్నింటికీ పూజనీయ స్థాయిలో ఉంచారు.ఇలాంటి మత క్రతువులు 15,000 సంవత్సరాలుగా ప్రబలంగా నాటుకుపొయాయి.


ఇది ఇలా ఉంచితే నాగులని పూజించే సాంప్రదాయం ప్రధానంగా వ్యవసాయక వర్గం నుంచి వచ్చి ఉండవచ్చు. 

హిందూ మతం లో నాగులు

 శివ,విష్ణు,వినాయక,కాలీ తదితర దేవుళ్ల చిత్రాల్లో చూస్తుంటాం. ప్రధానంగా క్షీర సాగర మధనం, 
శ్రీకృష్ణుని-వాసుకి వృత్తాంతం,నాగలోకం,నాగకన్యలు
యోగా సాంఖ్య శాఖల్లో సర్పాన్ని కుండలినీ యోగ ముద్రల్లో వాడుతారు. పొలాల్లో నాగదేవతారాదన కూడా పురాతన కాలం నుంచి ఉంది.

                                         

బౌద్ద మతం లో నాగులు 
ప్రధానంగా మహాయాన బౌద్ద శాఖ ఎక్కువ ప్రస్తావనలు ఉన్నాయి. త్రిపీఠికాల్లొని సుత్త పీఠికలో నాగులని జాతి వాచకంగాను. నాగలోకం, యక్షులు అనే పదాలు కనబడతాయి.
ఇంకా పద్మ సుత్త, ప్రాజ్నా పారమిత, హిమవంత సుత్త లో కనబడుతుంది.
                                              


జైన మతంలో నాగులు
తీర్థంకరులలో  పార్శ్వనాథ, సుపార్శ్వనాథ  చిహ్నాల్లో కూడ సర్పాలు ప్రాధాన్యం వహిస్తున్నాయి. జైన గ్రంథాల్లో కూడా నాగులు, యక్ష లాంటి పదాలు కనిపిస్తూ ఉన్నాయి.
           

జ్యోతిష్యం, వాస్తులో 
జ్యోతిష్యం లో నాగ/సర్ప దోషాలు పరిహారాల గురించి. నాగ దేవత ప్రతిమలను పూజించడం .

ఆగమశాస్త్ర ల్లో నాగులకు విశిష్టతనుఇవ్వడం దేవాలయాలు, చైత్యాలు,ఆరామలలొ నిర్మాణ పరంగా ప్రాధాన్యత ఇవ్వడం.
చారిత్రకంగా
కులవాదులు, ప్రాంత వాదులు,మత వాదులు ఈ విషయంలో  కొన్ని సంశయాలను వెల్లిబుచ్చారు.
నాగులు జాతి వాచకం అని కొందరు, అది ఒక సాంప్రదాయము అని మరి కొందరు తెలిపారు. ఐతే స్థానిక చరిత్రల ఆధారంగా నాగ జాతి ఉండేదని రాజులు ఉండెవారని తెలుస్తుంది.
1. ఈశాన్య భారతావని లో నాగ జాతి ఉంది.

2. అమరావతి స్థూపానికి ఒక నాగుల రాజు దానధర్మాలు చేశాడు.

3.తమిళ ప్రాంతంలో నాగులని పూజించే ఆచారం అనాదిగా వస్తుంది.

4.ఉపఖండం తో పాటుగా ఈశాన్య ఆసియా లో కూడా కొన్ని ఆధారాలు లభ్యం అయ్యాయి.

5. బౌద్ద మతానికి పూర్వం శ్రీలంక లో నాగులు ఉన్నారు. వారి మత ఆచార నిర్మాణం లభ్యమయ్యాయి.

6. ఆఫ్రికాలో సుమేరియ, ఈజిప్టు, స్థానిక తెగల్లో నాగులను పూజించడం వంటి విషయాలు త్రవ్వకాల్లో  బయటపడ్డాయి.

7.బర్మా,ఇండోనేషియా, పాకిస్థాన్, బంగ్లా, మలయ ఇతర చాలా ఆసియా దేశాల్లో పలు ఆధారాలు లభించాయి.
      ప్రపంచ వ్యాప్తంగా ఇలా నాగులను పూజనీయ స్థాయి కి అప్పటి మానవులు తీసుకువచ్చారు. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా వారి నమ్మకాలకి అనుగుణంగా క్రతువులను చేసి ఉండవచ్చు . 

          ఇవన్ని ఆయా ప్రాంతాల్లో సుదూర దేశాల్లో చాలా ప్రాంతాల్లో బయడపడటం వల్ల ప్రాంత, జాతి వాచకాల కన్నా  వేలయెండ్ల నుంచి మానవ సంచారం, నమ్మకాలు, ప్రకృతి ఆరాధికుల నుంచి వస్తున్న ఆచారం, సాధన సంపత్తి గానే మనం చూడాలి.
  ఏది ఎమైనా భారతీయ ధర్మాలు ఈ విషయంలో గొప్ప ప్రాముఖ్యతను ఆధ్యాత్మిక పరంగా పరిధిని మరింత విస్తృతం చేశాయి. 

 

Comments

Popular posts from this blog

kanishka in telugu | కనిష్కుడు

buddhism in telugu | భౌద్ధమతం