ANGULIMAALA |అంగుళిమాలుడు

                                                           అంగుళిమాలుడు 

  అంగుళిమాలుడు అనేవాడు అరణ్యం లో ఉంటాడు అతడు ఒక పెద్ద బందిపోటు . క్రూరుడు కనికరం లేకుండా ఎందరినో మట్టుపెట్టిన వాడు . అతనికి అనుచరులు చాలామంది ఉన్నారు . బుద్ధుడు వాళ్ళ దురాగతాలను విన్నాడు .

కొద్దీ మంది శిష్యులతో అడవికి వెళ్ళాడు అంగుళిమాలుడు ఎదురుగా నిలుచున్నాడు . తనకు భయపడని మనిషి తొలి సారిగా చూస్తున్నాడు . అంగుళిమాలునికి అర్థం కాక అయోమయంలో పడ్డాడు .
     

బుద్ధుడు అతనితో పరిభాషించ్చాడు "అంగుళిమాల ! నన్ను గమనించు .నేను ప్రశ్అంతగా ఉన్నాను . నేను ఎవరికీ హాని ఛాయను . కానీ నిన్ను నీవు తెలుసుకో . నీ మనసులో ఎప్పుడు ఆందోళన . ఏనాడు  తృప్తిగా తినలేవు . సంతోషన్గా ఒక చోట ఉండలేవు . ప్రజాజీవితం లో తిరగలేవు . అటవీ జంతుజాలం తో ఒక మృగంలా బ్రతుకుతున్నావు . మనుషుల్ని హింసించి , చంపి రోజులు వెళ్ళబుచ్చటం కంటే - కాయ కష్టం తోనో , యాచన తోనో జీవించటంలోనే తృప్తి ఉంది . కక్ష్య తో శత్రువు కలిగించే హాని కన్నా , పేద దారిన పడిన మనసు పెట్టె కష్టం మిన్న "


బుద్ధుడి మాటలు పని చేసాయి . అంగుళీమాలి లో పరివర్తన వచ్చింది . అతడు బుద్దుడికి ప్రణామాలు చేసాడు . విపినం విడిచాడు . బుద్ధుడిని అనుసరించాడు . అతడూ అతని అనుచరులు దీక్షలు తీసుకున్నారు అంగుళిమాలుడు అహింసకుడు అయ్యాడు . బుద్ధుడు అడవిని జయించాడు.

ఈ విషయమే జయమంగళ అట్టగాథలో ఉంది

"ఉక్ఖిత్త ఖగ్గమతి హత్థ సుదారుణన్తం
 ధావన్తీ  యోజన పదాజ్ఞ లిమాలవన్తం
ఇద్దీభి సాకంతా మనో జీతనా మునిన్దో ,
  తం తేజస భవతు తే  జయమంగళాని "
 
 అనగా
                   
ఏ మునీంద్రుడైతే ,చేతిలో ఖడ్గం తో యోజనాలు పరిగెత్తగల అత్యంత భయానకుడైన అంగుళి మాలుడిని , తన బుద్ధి బలంతో జయించాడో , అటువంటి బుద్ధభగవానుని పరాక్రమం వాళ్ళ నాకు జయం కలుగు గాక , మంగళం కలుగుగాక .






Comments

Popular posts from this blog

kanishka in telugu | కనిష్కుడు

buddhism in telugu | భౌద్ధమతం