kalwakurthy history
కల్వకుర్తి ప్రాంత చరిత్ర
ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలో భాగాన ఉన్నటువంటి కల్వకుర్తి ప్రాంత చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం . ఈ ప్రాంతం ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్య సామంతులైన రేచర్ల పద్మనాయకుల పరిధిలో ఉన్నదీ . ఐతే వీరు ప్రారంభం లో వీరు సామంతులుగా ఉన్న తర్వాత వీరు స్వత్రంత ను ప్రకటించుకున్నారు . వీరు దేవరకొండను కేంద్రంగా చేసుకొని పరిపాలించగా దీని పరిధిలోకి ప్రస్తుత కల్వకుర్తి ,రఘుపతిపేట మరియు వెల్డందా ప్రాంతాలు ఉండేవి సుమారుగా వీరు క్రీ షా 1300-1470 వరకు పరిపాలించినట్టు గ తెలుస్తుంది .
ఈ ప్రాంతం లో ఎక్కువగా వ్యవసాయం , అడవులు ఎక్కువగా ఉండేవి . తర్వాత బహమనీ సుల్తానుల ఆధీనం లో భాగంగా కొంతకాలం అనేవి ఐతే పూర్వం ఎక్కువగా ఈ ప్రాతం లోనే యుద్దాలు జరుగుతూ ఉండేవి . ఎక్కువగా కొండలు , గుట్టలు ఉండే రాచకొండ రాజ్యం లో ఇదే ప్రధాన మైదనా ప్రాంతం కావడం తో ఈ ప్రాంతం పై పట్టు సాధించడాని విశేష ప్రయత్నాలు జరిగాయి . శ్రీశైల ఉత్తర ద్వారంగా పిలవబడే ఉమా మహేశ్వరం కూడా వీరి ఆధీనం లో ఉండేది .కాగా వీరి తొలి రాజధాని అమ్రాబాద్ . ఆ తరువాత వీరు తమ రాజధాని దేవరకొండ - రాచకొండ కు మార్చుతూ వచ్చారు .
వీరి కాలం వరకు అమ్రాబా ద్ లో బౌద్ధం వెలసిల్లి ఆ తరువాత కనుమరుగు అయింది . ఆ ప్రాంతం లో ఉన్న చాల బౌధ్హ ఆరామాలు శివాలయాలు గా మార్చబడ్డాయి .
వీరి శాసనాలు ఎక్కువగా దేవరకొండ , రాచకొండ ,కొండారెడ్డి పల్లి గ్రామాల్లో లభించాయి . నిజాం కాలంనాటికి కల్వకుర్తి ఒక స్వరూపం రూపుదిద్దుకొన్నది . వారి కాలంలో అనేక చెరువులను నిర్మించి వ్యవసాయానికి ఎంతగానో కృషి చేశారు .
Comments
Post a Comment