VISHNUKUNDINS | విష్ణుకుండినులు

                                                           
                                                                 విష్ణుకుండినులు 

కీల్ హారన్ ప్రకారంగా వీరు గుంటూరు లోని వినుకొండ వాస్తవ్యులు . వీరు శ్రీ పర్వత స్వామీ భక్తులు . దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు . వీరి రాజ్యస్థాపకుడు "మహా రాజ రాజేంద్ర  వర్మ " క్రీ శ 350 లో స్థాపించాడు . 

మాధవవర్మ - 370-398 సంవత్సరాల  మధ్య పాలించాడు . ఈయన 11 అశ్వమేధ యాగాలు చేసాడు .

గోవిందా వర్మ - 398-435 ల మధ్య పాలించాడు . ఇతడు హిందూ మతాన్ని అనుసరించి బౌద్ధ మతాన్ని పోషించాడు . ఈయనే గోవిందా రాజుల విహారాని బౌద్ధ మతస్థులకు నిర్మించి ఇచ్చాడు . ఈ విషయాన్ని చైతన్యపురి (హైదరాబాద్ ) శాసనం ద్వారా తెలుసుకోవచ్చు . 

3వ మాధవ వర్మ - ఈయనకు త్రికూట మలయాధిపతి అని బిరుదు . 

ఇంద్రభట్టారక వర్మ - ఈయన ఎన్నో ఘటికాలను స్థాపించాడు . ఇందులో మూల ఘటికగా  అనాసాపురం ఉండేది ఇవేకాక అమరావతి ,వేంగి,ఘటకేశ్వరం ముఖ్యమెయినవి (ఘటికాలు అనగా  విద్యాలయాలు) 

2వ విక్రమేంద్రవర్మ -రాజధానిని దెందులూరుకు మార్చడు . 

4వ మాధవ వర్మ - ఈయన దుర్గ మల్లేశ్వర స్వామీ భక్తుడు కాగా రాజధానిని బెజవాడకు మార్చాడు . దుర్గ ఆలయాన్ని ఈయనే నిర్మిచాడు . జనాశ్రయా ఛందోవిచ్చితి అనే గ్రంథాన్ని రాశాడు . ఇది వ్యాకరణ గ్రంథం . 

కుమారా మంచాన భట్టారక - ఇతనే చివరి రాజు తర్వాత పశ్చిమ చాకుక్య రాజైన 2వ పులకేశి ఆక్రమించుకున్నాడు . 


                      ఇక వీరి కాలం లోనే హిందూ మతం తిరిగి పునర్వైభవం సంతరించుకోగా , బౌద్ధం నిరాదరణ చెందింది . వజ్రయాన   బౌద్ధం కూడా ఈ కాలం లోనే ఉద్భవించింది . ఉండవల్లి గహలాయాలు వీరి కాలానికి  కి సంబందించినవి . 


                       జైన మతం విషయానికి వస్తే "కుమారులభట్టు" అనే మహర్షి జైన మహర్షుల వద్ద విద్య నేర్చుకొని జైన మహర్షులు ప్రతిపాదించిన "పూర్వమీమాంస" ను గట్టిగ వ్యతిరేకిస్తూ "తంత్రవార్షికా" అనే భాష్యాన్ని రాశారు . ఇతడు ఆ తర్వాత ఎంతో మంది జైనులను హిందువులుగా మార్చాడు . ఈ సమాయం లోనే జైనం లో "కాపాలికశాఖ " రావడం జరిగింది . 



                       వీరి రాజా భాష సంస్కృతం . నల్గొండ ,గుంటూరు ప్రాంతాల్లో వీరి బంగారు , వెండి నాణాలు లభించాయి . 2వ మాధవవర్మ కాలం లోనే అమరావతి బౌద్ధస్తూపాన్ని "అమరేశ్వర దేవాలయంగా మార్చారు . విజయవాడ లోని అక్కన్న , మాదన్న గుహాలయాలు వీరి కాలం లోని వి గ చెప్పవచ్చు . వీరి రాజా లాంఛనం సింహం . 



Comments

Popular posts from this blog

kanishka in telugu | కనిష్కుడు

buddhism in telugu | భౌద్ధమతం