jainism in telugu | జైనమతం

                                                                    జైనమతం 
జైన మతం అత్యంత ప్రాచీనమైనది . ఈ మాత ప్రభోధకులను "తీర్థంకరులని" పిలుస్తారు . మొత్తం 24 మంది తీర్థంకరులున్నారు . పురాణాల ప్రకారం మొదటి తీర్థంకరుడు -ఋషభనాథుడు ఇతని కుమారుడే బాహుబలి (గోమఠేశ్వరుడు). బాహుబలి సోదరుడే భరతుడు . కాగా చారిత్రకంగా మాత్రం పార్శ్వనాథుడు 23 వ వాడు . 


                             వర్తమాన మహావీరుడు ఆఖరి (24) వ తీర్థంకరుడు మహావీరుడు జైన మతాన్ని సంస్కరించి దానికి చక్కని రూపాన్ని ఇవ్వడం జరిగింది . ఇతడు క్రీ పూ 540-468 మధ్య కాలానికి చెందిన వాడు . మహావీరుడు వైశాలి సమీపం లో ని కుంద అనే గ్రామం లో జన్మించాడు . తండ్రి జ్ఞానిక క్షత్రియ వంశానికి చెందిన "సిద్ధార్థుడు" తల్లి త్రిషలా . ఇతడు 12 సం .లు తపస్సు చేసి జినుడు అయ్యాడు . ఇతడు సన్యాసం తీసుకున్న తర్వాత అనేక మంది సిద్ధులను , యోగులను కలుసుకున్న అందులో గోశాలి పుత్ర మక్కాలి ఒకరు. ఆయన సిద్ధాంతాలు మహా వీరునికి రుచించక ఈయన వేరే మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది . జినుడు అనగ జ్ఞాన ప్రవాహాన్ని దాటినవాడని అర్థం . ఈయన తన 77 వ ఏటా బీహార్ లోని పావపురి లో నిర్యాణ ము చెందారు . 
                                 జైన మత ప్రభోధనలు 
1.సత్యము 
2.అహింస 
3.అస్తేయం (ఇతరుల ఆస్తిని కాజేయడం చేయకుండుట)
4.అపరిగ్రహం (అవసరానికి మించి ఆస్తి లేకుండా ఉండటం )
ఇతడు ప్రత్యేకంగా చేర్చిన ది 
5.బ్రహ్మచర్య . 
           మగధ పాలకులైన హార్యంక ,నంద వంశ రాజులు ఈ మతాన్ని ఆదరించారు .మన దేశం లో జైన మతం ఎక్కువగా రాజస్థాన్ , గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఉండగా ఓడిశాలోని ఉదయగిరి ప్రాంతంలో కూడా వీరి జనాభా ఉంది . తెలంగాణ లోని కొలనుపాక మన రాష్ట్రం లో ని చారిత్రక పుణ్య క్షేత్రాలు . 
             రాజస్థాన్ లోని మౌంట్ అబు లోని దిల్వారా  వీరి పుణ్య క్షేత్రం. 
వేదాలలో కూడా  వీరి ప్రస్తావన ఉంది . జైనులను వేదాలలో శ్రమణులని పేర్కోవడం జరిగింది. 
ఆ కాలం లో ఉన్న మూఢ నమ్మకాలను జైన మత గురువులు విమర్శించే వారు . జంతువద , ఖర్మకాండలకు వీరు వ్యతిరేకం . 
             ఆ తర్వాతి కాలాల్లో జైన మతం 2 శాఖలుగా విడిపోయింది అవి 
1. శ్వేదంబర (వీరు తెల్లటి వస్త్రాలను ధరిస్తారు )
2..దిగంబర  (వీరు దిగంబరంగా ఉంటారు ). 
                    వీరి పవిత్ర గ్రంథాలు అంగాలు అని పిలుస్తారు . ఐతే ఈ మతం అధికంగా వైష్యులనే ఆకర్షించడం జరిగింది . చాలా మంది రాజులు , చక్రవర్తులు జైన మతాన్ని పుచ్చుకున్న సిద్ధాంతాలను పాటించలేక తిరిగి పూర్వ మతాలని తీసుకున్నారు . శాంతి , అహింస వీరి ప్రధాన జీవన సిద్ధాంతాలు . 




Comments

Popular posts from this blog

kanishka in telugu | కనిష్కుడు

buddhism in telugu | భౌద్ధమతం