MUDHRAS IN TELUGU

                                                       
   మన భారతీయ  యోగ  శాస్త్రం లో ఎన్నో ఆసనాల గురించి చెప్పబడ్డాయి . ఐతే దానితో పాటుగా కొన్ని ముద్రల గురించి కూడా తెలుపబడ్డాయి . అందులోని కొన్ని ముఖ్య ముద్రలను గురించి మనం తెలుసుకుందాం . మన చేతి వ్రేళ్ళకు ప్రతి ఒక్కదానికి ఒక్కో ఎలిమెంట్ గా గ్రంథాల్లో తెలియచేయడం జరిగింది . ఉంగరపు వేలు భూమి గ , చిటికెన వేలు ను జలంగా , చూపుడు వేలును వాయువుగా ,మధ్య వేలును ఆకాశంగా ఈ విధంగా మన ఐదు వ్రేళ్ళు ఉంటాయి వీటి ని ప్రతి రోజు ధ్యానం లో భాగంగా ఒక్కో ముద్రను 5-10 మైన అభ్యాసం చేసుకోవచ్చు .ప్రస్తుతం మనం 3 ముఖ్యమైన ముద్రల గురించి తెలుసుకుందాం. 

1.ప్రిథ్వీ ముద్ర - ఈ ముద్ర ద్వారా మనం భూమి కి సంబంధిచిన గుణాలను పొందగలం. దీని ద్వారా మన శరీరం లోని ఉష్ణాన్ని తగ్గిచుకోగలం , ఒత్రిడిని అలాగే శరీర బరువును తగ్గిచుకోగలం . వెంట్రుకల పెరుగుదల కూడా మెరుగవుతుందని చెప్పబడింది .
2.జల ముద్ర -ఈ ముద్రని వరుణ ముద్ర అని కుడా పిలుస్తారు . ఇది జలానికి   సంభందించినది . ఇది చేయడం ద్వారా మన నాలుక కు సంబందించిన ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి .డి హైడ్రాషన్ తగ్గుతుంది  నోరు ఎండినట్టున్న వారికి ఈ ముద్రను అభ్యాసం చేయడం వల్ల ఇటువంటి సమస్యలు తగ్గుతాయి.

3.వాయు ముద్ర - ఈ ముద్ర ఎంతో ప్రధానమైనది .ఈ ముద్ర గాలి కి  సంబందించినది . దీని వాళ్ళ  చర్మ సంబందమైన సమస్యలు తొలుగుతాయి . మానసిక ప్రశాంతత  లభిస్తుంది
ఇంకా ఈ విషయములో మరింత పూర్తి సమాచారం కోసం యోగ మరియా ధ్యాన నిపుణుల సలహాలు తీసుకోగలరు.                                               

Comments

Popular posts from this blog

kanishka in telugu | కనిష్కుడు

buddhism in telugu | భౌద్ధమతం