భారతదేశం మరియు నాస్తిక భావజాలం | India and Atheism

                                           భారతదేశం మరియు నాస్తిక భావజాలం 


మన దేశంలో అనేక మతాలు ఉద్భవించిన  ఎన్నో సిద్ధాంతాలు పుట్టుకొచ్చిన   నాస్తిక 
భావజాలం కూడా  ముందు నుంచి ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి.  నాస్తికత్వం అనగా దేవుడి పై  విశ్వాసాన్ని ఉంచకపోవడం.  శ్రమన పారంపర్యం, జైన, బౌద్ధ, చార్వాక, లోకయత, ఆజీవక  ఇలాగే చాలా మతాల్లో కొంత వరకు నాస్తిక త్వాన్ని బోధించారు. కొంత మంది ఋషులు కూడా కొంత మేర ఈ ప్రభావానికి లోనయ్యారు. వారిలో  జైమిని, పద్మాకర, జాబాలి  ఆధునికంలో  సావర్కర్  తో పాటుగా చాలా మంది ఉన్నారు. 
హిందూ మతం దేవుని పట్ల విశ్వాసం, కర్మ, పునర్జన్మ లాంటి విషయాలలో విశ్వాసం ఉంచినా  అదే విధంగా నాస్తికత్వం ని కూడా అదే తనలో ఇమిడ్చుకోగలిగింది. వ్యాసుడు రాసిన ఉత్తర మీమాంస ఆస్తిక గ్రంథం కాగా  ఆయన శిష్యుడైన జైమిని మహర్షి రూపొందించిన పూర్వ మీమాంస మాత్రం నాస్తిక భావజాలం ఉంది. ఈ విధంగా  భారతీయ గురుకులాల్లో మొదటినుంచి కూడా ఈ రెండు గ్రంథాలను అభ్యసిస్తూనే ఉన్నారు విద్యార్థులు. ఈ విధంగా ముందు నుంచి మన భారతీయ గురువులు  అధ్యాపకులు  ఈ  రెండు అంశాలమీద విశాల భావజాలాన్ని అవలంభిస్తూ  వచ్చారు .
                  
అలాగే  మన దేశంలో ఇతర మతాల్లో కూడా  సాంఖ్య  దర్శనం, యోగా లాంటి  ఇతర క్రియల్ని కూడా అనుసరించేవారు . ఈ విధంగా  చాలా మతాలు ఉన్నప్పటికినీ    సిద్డంతాలు  అభిప్రాయాలు వేరు ఐనప్పటికిని  అనుసరించే విధానాలు  భారతీయ తత్వాన్ని జాగృతం చేసేవి . 

ఉదాహరణకు  హిందూ మతం లో కుండలిని, హఠ  యోగ  లాంటి  ప్రక్రియలు ఉండగా  బౌద్ధం  లో  విపాసన  లాంటి  పద్ధతులు ఉండేవి. ఒక మతపు  సిద్ధాంతాలు మోక్షం అని పలుకగా మరో మతం లో శాంతి పద నిర్వాణ ప్రాప్తి అనే వారు . ఈ విధంగా  అనేకమైనవి దగ్గరిగా ఉన్నప్పటికీ  యజ్ఞా, యాగ  క్రతువులు, వేదాలు వంటి విషయాల మీద ఆయా వర్గాల మధ్య ఎప్పుడు వాదనలు జరిగేవని తెలుస్తుంది. ఇవి ఆది శంకరాచార్యుల  కాలం నాటి వరకు  జరిగేవి.

మన దేశంలో కొన్ని శతాబ్దాలు మాత్రం ఆధ్యాత్మికంగా చాలా గందరగోళ  పరిస్థితి నెలకొని ఉండేది. ఉదాహరణకు ఒక రాజు ఒక మతం లోనుంచి మరో  మతం లోకి మారితే  ఖచ్చితంగా ఆ రాజ్యం మొత్తం కొంత ప్రభావాన్ని చవి చూసేది. ఆ కాలం లో రాజులే కాదు రానులు  కూడా మతం విషయంలో తమ ప్రభావాన్ని చూపించగలిగేవారు . 
         
జైన, బౌద్ధ మతాలు జన బాహుళ్యం లో  చొచ్చుకు వెళ్లిన  ఆజీవక, చార్వాక  మరికొన్ని శ్రమనక మతాలు మాత్రం జన బాహుళ్యం లో  వెళ్లలేక పోయాయి . దీనికి  కారణం రాజులు పరిపాలనాధీశులు  అంతగా ఆసక్తి ని చూపించక పోవడమే కారణం అని చారిత్రక వాదుల అభిప్రాయం. 

నాస్తికత్వం  ఉన్నప్పటికినీ అప్పటి గురువులని, మత ప్రారంభకులకి  ప్రజలు లేదా ఆ మతం లోని వారు ఆ స్థాయి  విలువని  ఇచ్చేవారు. ఎన్నో ఆరామాలు కట్టించేవారు . మునులు ధ్యానం చేసుకోవడానికి  అనేక  గుహలను తొలిపించేవారు . ఆయా మత  సన్యాసులకు వసతి కేద్రాలని  ఏర్పాటు చేసేవారు. మరియు ఎన్నో దానాధి ధర్మాలని చేసేవారు. వారు  పుణ్యం దక్కుతుందనే భావించేవారు.

అయితే  కొన్ని రాజకీయ  భావజాలం తో  విషం చిమ్మే  వారి కన్నా అప్పటి   నమ్మకాల  విషయంలో  ప్రజలు ఎంతో విశాల భావజాలం తో  ఉన్నారనే  విషయం అర్థం అవుతుంది . అనేక  బౌద్ధ స్థూపాలకు సామాన్యులు కూడా  విరాళాలు ఇచ్చేవారు . ఉదా ||అమరావతి స్థూపం  లాంటిది . అంతే కాకుండా బెజవాడలో   జైన  శ్రమణుల కోసం  నెడుంబసతి  ని ఏర్పాటు చేశారు అని తెలుస్తుంది . మూగజీవుల విషయంలో  కాఠిన్యాన్ని చూపకుండా  ఎవ్వరి విశ్వాసాల్ని పాడు చేయకుండా  ఉండేదని అప్పటి శాసనాలు ,  చారిత్రకారుల  మాటల ద్వారా అర్థం అవుతుంది . 

ఈ మధ్య కాలాలలో   నాస్తికత్వం అంటే కేవలం ఒక మతాన్ని దృష్టిలో ఉంచుకొని  వారిపై  ,వారి  నమ్మకాల మీద దాడి చేసే ఒక   అంశంలా మాత్రమే తయారైంది . ప్రాచీన 
భారత దేశంలో  ఎన్నో సిద్ధాంతాలు  ఎన్నో బేధాలు  , వైరుధ్యాలు  ఉన్నప్పటికినీ  ఒక ప్రవాహం లాగ కలిసేవని అర్థం అవుతుంది . అంటే అప్పుడు కూడా మతాల మీద వాదనలు , నిందలు  కూడా జరిగేవి . కానీ వాటి మధ్య అగాధాలను   అయా  మతాల పండిత వర్గాలు  తర్కాల ద్వారా పరిష్కారం చేసుకొనేవి గా మనకు అర్థం అవుతుంది . కావున  అప్పటి సామాజిక మంచి అంశాలని  ఇప్పుడు కూడా మనం అనూకూలంగా తీసుకుని  మంచి మార్గాల్లో ప్రయాణించాలని  ఆశిస్తున్నా ...  సర్వేజనా  సుఖినోభవంతు || 


Comments

  1. సాంఖ్యాన్ని, నాస్తికత్వాన్ని, అప్పటి మనుషుల ఆలోచనా విధానాలని, ఇప్పటి లోటుపాట్లని చాలా బాగా వివరించావు సోదరా 👏👏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

kanishka in telugu | కనిష్కుడు

buddhism in telugu | భౌద్ధమతం