అంకుశం 

 అంకుశం చూడటానికి అలంకరణతో కనపడే ఈ పరికరం పెద్ద పెద్ద జంతువులని నియంత్రించడానికి వాడతారు . చూడటానికి భిన్న భిన్న ఆకృతులతో చూడటానికి అందంగా కనిపించే ఇది ఒక బలమైన ఆయుధం . ఏనుగు , ఒంటె లాంటి పెద్ద జంతువులను కూడా ఇది బాధపెట్టగలదు . 

             పురాతన కాలం నుండి ఆయా ప్రాంతాల్లో  మద గజాన్ని  అంకుశం అంకుశం సహాయం తో దాని గర్వాన్ని అణిచి దానిని నియంత్రించి  దానిమీద ఆసీన్నులు అయ్యే క్రీడ కూడా ఉండేది . అలాంటి క్రీడలు తలచుకుంటేనే ఎంతో బాధాకరంగా ఉంటుంది .     

                ఐతే ఈ అంకుశాన్ని ధరించే దేవతలు , యక్షులు కూడా ఉన్నారు ఇవి ఆయా సమూహాల్లో   ఇవి ప్రముఖ స్థానాన్ని సంపాదించి ఉన్నాయి . ఐతే ప్రధానంగా  మన గర్వాన్ని , అహంకారాన్ని, రాగ , ద్వేష, మోహాలను  అణచివేయడానికి  ఒక గుర్తింపుగా దేవతల , యక్షుల , ఇతర ప్రతిమల చేతుల్లో  ఉండే అంకుశా నికి  అర్థం కావచ్చును . 

ఈ విధంగా ఈ ఆయుధం మతం , ఆధ్యాత్మికంగా ఒక సూచిక స్థాయికి ఎదిగింది .                                                     

                                                                సాధారణ  అంకుశం 

దీనిని సన్యాసులు కూడా వాడేవారు బౌతికంగా ఆలోచిస్తే దట్టమైన అడవుల్లో కొన్ని జంతువుల నుండి  రక్షణ కోసం బహుశా వాడి ఉండవచ్చును . ఐతే దీనికి కొందరి సమాధానం  అంకుశాలను మంత్రం , తంత్ర శాస్త్రాలలో ఇవి ఎందుకు వచ్చాయో తెలుసుకోవాల్సిన విషయం (కెనడి  అభిప్రాయం ) . ఐతే ఈ శాస్త్రాల ప్రకారం వేరు వేరు అంకుశాలను కూడా వాడటం మనం గమనించవచ్చు . 

                                                                      గజ అంకుశం


1. గజ అంకుశం / చతుర్ముఖ గజ అంకుశం 

2. కపాల  అంకుశం / చతుర్ముఖ  కపాల అంకుశం / మూడు వరుసల కపాల అంకుశం

3. సర్ప అంకుశం/ నాగ అంకుశం

4. వజ్ర అంకుశం 

 (పైన మొన దేలిన 4 రేకులను  ఒక దగ్గరికి మడిచి ధ్యాన జప సాధనలో ఉపయోగించడమే  అని కొందరి అభిప్రాయం . మరి కొందరు ఇంద్రుని వజ్రాయుధం తో పోల్చారు. దీనిని ప్రస్తుతం ఇప్పటికి టిబెట్ ప్రాంతాల్లో వాడుతున్నారు .)

                                                  


                                                                 వజ్ర అంకుశం 

ఇప్పటికి ఒడిశా ప్రాంతం లో గజ అంకుశం, నేపాల్ లో సర్ప, కపాల అంకుశాలు  బయల్పడటం జరిగింది .  మీకు దీనిపై ఏమైనా విషయాలు తెలిస్తే చెప్పగలరు ..... 

         

Comments

Post a Comment

Popular posts from this blog

kanishka in telugu | కనిష్కుడు

buddhism in telugu | భౌద్ధమతం