సోమదేవుని యశస్థిలకము
సోమదేవసూరి రచించిన యశస్థిలకం 9-10 వ శతాబ్దపు మత , సామాజిక , ఆర్ధిక , పరిపాలన పరమైన, ప్రజల ఆహార అలవాట్ల మీద కూడా వివరంగా కూలంకషంగా చర్చించబడింది .
ఐతే ఈ గ్రంథం గురించి కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది .
సోమదేవసూరి ప్రసిద్ధ జైన మతాచార్యులు ఆనాటి కాలంలో ఈయన పరమార రాజ్య , వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో పనిచేసిన వారు ఈయన . 2 వ అరి కేసరి తర్వాత రాజైన వాగ రాజు ఆస్థానంలో ఉన్నాడు మరియు 2 వ బద్దెగుడి విద్యా గురువు సోమదేవుడు.
అనగా ఈయన వాగరాజు, 2వ బద్దెగుడు , 3వ అరికేసరి కాలం వాడు .
ఇతని బిరుదులు:
తార్కిక చక్రవర్తి , కవికుల రాజు ,శాద్వదాచాల సింహ , వాక్కల్లోల పయోనిధి
ఇతని రచనలు:
యుక్తచింతామని, సనావతి ప్రకరణం,నీతికావ్యామృత మరియు యశస్థిలక చంపూ కావ్యం
3వ బద్దెగుని పర్బనీ శాసనం ప్రకారం సోమదేవునకు వాణికటువుల గ్రామాన్ని దానం చేసారు.
> సోమదేవుడికి పరమార రాజ్యం తో పాటుగా వేములవాడ చాళుక్యులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది.
>పశ్చిమోత్తర తెలంగాణ వేములవాడ చాళుక్యుల ఆధీనంలో ఉండేది . వీరు రాష్ట్రకూటుల కు సామంతులుగా ఉండేవారు .
>2 వ అరికేసరి సమయంలో వేములవాడలో శుభదామ జినాలయాన్ని నిర్మించారు .
>ప్రస్తుత గంగాధర ప్రాంతంలో గవుండ సంఘం వారు ఒక జినాలయాన్ని , బసది మరియు గోశాలని నిర్వహించేవారు ఇక్కడ కూడా సోమదేవసూరి కొంత కాలం గడిపారని ప్రతీతి.
> యశస్థిలక చంపూ కావ్యం లో ప్రధానంగా అప్పటి జైన మతం, ఆహారపు అలవాట్లు,శైవ మతం, కాలముఖులు - నకుశీల సిద్ధాంత మాల అనే గ్రంథం ఆధారంగా వారి మతాన్ని ఆచరించేవారు.
>తాంత్రిక పూజా విధానాన్ని "వామ మార్గ " గా పేర్కొన్నారు .
యశోధర పాత్ర(పాంచాల) ద్వారా ఆనాటి జంతు బలులను గురించి వ్యతిరేకంగా మరియు వివాదాస్పదంగా కూడా ఈ రచన ఉన్నట్టు చెబుతారు చారిత్రకారులు .
> ఇక అప్పటి జైనుల ఆహార అలవాట్లను గురించి, ఉపవాస దీక్ష ల గురించి , జైన బసదులు వారి యొక్క ముఖ్య విద్యాపీఠాలు, అందులో అభ్యసించే మత గ్రంథాలు గురుకుల విధానానికి దగ్గరి పోలికలతో ఉంటుంది.
>ఆకాలం లో మత సంబంధమైన దానాల్లో వెండి మరియు బండారు లోహాలను ఎక్కువగా దానం చేసేడి వారు .
>ఏదైనా గ్రహణాలు ఉన్నప్పుడు చెడు గా భావించే వారు గ్రహణం ముగిసిన తర్వాత స్నానాది జప తపాలు చేసేవారు , జైనా రామాల్లో సంప్రోక్షణ చేసేవారని ఈ కావ్యం లో చెప్పబడింది .
>శ్రీ పర్వతం లో అనేక జైనారామాలు ఉండేవని వీటిని తానూ దర్శించానని సోమదేవుడు చెప్పుకున్నాడు (13 వ శతాబ్దపు కన్నడ జైన మతాచార్యుడు శ్రీ పర్వత ప్రాంతం లోని జైనారామాల దుస్థితిని విమర్శనాత్మకంగా నయసేనుడు ధర్మామృతం అనే కన్నడ గ్రంథం లో తెలిపాడు . )
>జైనుల ప్రత్యేక దినాలు వారు ఆ రోజు ఆచరించే పనుల గురించి ఈ గ్రంథంలో పేర్కొనబడి ఉంది .
అప్పటి హిందూ మతంలోని వామాచారాలు తాంత్రిక పద్ధతులు , తమ శరీరంలోని భాగాలను కత్తిరించుకోవడం , కాళ్లు చేతులను నరుక్కొని దేవుడికి అర్పించడం లాంటివి శైవం లోని ప్రధాన ఆచారాలుగా చెప్పబడింది . కన్నడ దేశంలో వీర శైవం విస్తరించేవరకు జైనం పెద్ద వర్గంగా నిలబడింది .
Comments
Post a Comment