#హిందూ_మత_పునరుజ్జీవనం REVIVAL OF HINDUISM IN TELUGU
హిందూ మత పునరుజ్జీవనం
బౌద్ధ, జైన మతాలు అంతరించిన తర్వాత హిందూ మతం తిరిగి ఆధ్యాత్మిక పరంగా , ఆచారాల వ్యవహారాల రీత్యా , రాజకీయ పరంగా తిరిగి తన అస్థిత్వాన్ని పొందింది అని చెప్పవచ్చు .
..... ఐతే ఇది ఎలా జరిగింది ?
........ దీని వెనక ఏం జరిగింది ?
...... జైన , బౌద్ధ మతాలు ఏ తమ స్థానాలను ఎలా కోల్పోయాయి ?
ఇలా ఎన్నో వందల కొద్దీ ప్రశ్నలు మన మెదళ్ల లో తిరుగుతుంటాయి . ఐతే ఈ విషయంలో లోతుకు
వెళ్తే జైనం , బౌద్ధ మతాలు వైదిక , బ్రాహ్మణ భావ జాలానికి వ్యతిరేకంగా ఏర్పడ్డాయి. ఆ కాలానికి బ్రాహ్మణులు
ఆర్థికంగాను సమాజంలో ఎంతో పరపతి తోనూ ఉండేవారు. తమని తాము భూమి పై నడయాడే దేవుళ్ల గానూ, కనబడే
దేవుళ్లు గానూ చెప్పుకున్నారు. దీనిని బట్టి అప్పటి సమాజం లోని పరిస్థితిలు ఎలా ఉండేవో మనం అర్థం చేసుకోవచ్చు.
మరియు అప్పటికే సమాజంలో అనేక సిద్దాంతాలతో నిండిపోయాయి.
బౌద్ద మతం , జైనం అనేక శాఖొపశాఖలుగా విడిపోయాయి. ఒక మతం లోని వారే ఒక శాఖ తో మరో శాఖ వారు
వాదోపవాదాలు చేసుకోసాగారు.
ఒక్కొక్కరు తమ శిష్యగణాన్ని వెంటవేసుకొని తమనే బుద్దుడి గా భావించుకునేవారు. సరిగ్గా ఇదే సమయం లో ఈ
మతాల మీద రాజుల ఆదరణ అనేది సన్నగిల్లింది. దీనికి కారణం బౌద్ద, జైన మతాల ప్రకారం రాజు కేవలం ఒక
మానవుడు మాత్రమే కాని హిందూమతం ప్రకారం రాజు ఒక చండశాసనుడి వలే , ఒక పురాణ పురుషుడి వలే, ధర్మాన్ని
కాపాడి దైవత్వం తో సరిసమానంగా పాలించవచ్చు.
శుంగులు వర్ణం రీత్యా బ్రాహ్మణులు, వీరి పరిపాలనకాలం లో బౌద్ద సన్యాసుల మీద ఆరామాల మీద దాడులు
జరిగి సంపద దోచుకొనబడింది. ఆ తరవాత వాటిని హిందూ దేవాలయాలుగా మార్చారు. ఈ ప్రక్రియ వీరి కాలం లొనే
పురుడు పోసుకుంది. అక్కడక్కడ బౌద్దులు తిరగబడిన వారిని భౌతికంగా లేకుండా చేసారు.అశోకుని కాలం లో
బ్రాహ్మణుల పరిస్థితి ఘోరంగా ఉండి మిగిలిన వర్ణాలు వివాహాలలో సాంకర్యం జరిగిందని తెలుస్తుంది.
తదుపరి అనేక రాజ్య వంశాలు తమ రాజ్య విస్తరణకు మరియు బలంగా చేసుకొనుటకు ఈ పద్దతినే
అవలభించారు. ఎప్పుడైతే రాజ్యాధరణ కోల్పోయిన బౌద్ద , జైన మతాలు ఆరామాలను నడపడానికీ కూడా ఇబ్బంది
పరిస్థితిలు ఏర్పడ్డాయి.
సరిగ్గా ఇదె సమయంలో బుద్దుడిని దశావతారాల్లో ఒక అవతారం గా సృష్టించారు. ఆది శంకరాచార్యుల గురువైనా
గౌడ పాదులూ దీన్ని బాగా ప్రాచూర్యం లోకి తీసుకువచ్చారు.
నయసేనుని ధర్మామృతమ్ అనే గ్రంథం లో సన్యాసులు ధనం కోసం చేసిన అశ్లీల కార్యక్రమాల గురించి చెబుతూ ఆయన వాపోయాడు.
.
అప్పటికి హిందూమతంలో అంతర్గతం గా ఎన్నో కుమ్ములాటలతో ఉండేది. దీనిని గమనించిన ఆది శంకరులు
శైవం , శాక్తేయం, గణాపత్యమ్, వైష్ణవులు ఇలా అనేక శాఖల మధ్య సఖ్యతను తీసుకువచ్చారు. తరువాత ఈయన
శిష్యులతో సాగిన ధర్మ ప్రచారం గొప్ప మార్పులను తీసుకువచ్చాయి. ఈయన అద్వైత సిద్దాంతాలతో బౌద్ద
పండితులతో చర్చలు జరిపాడు అందువల్ల ఇతనిని ప్రచ్చన్నబుద్ద అని పిలుస్తారు.
ఆ తర్వాత రామానుజులు చాల మందిని జైన మతం నించి వైష్ణవులు గా మార్చాడు (హొయసల రాజు
విష్ణువర్ధనుడు/ భట్టి దేవ) ఉన్నత మైన శూద్ర కులాల వారిని, భూస్వాములను, వ్యాపారులను తన శిష్యులుగా
చేసుకున్నారు. తిరుపతి మొదట జైనుల స్థావరం అని ఆది శంకరుల కాలంలో ఆలయంగా ఈయన కాలంలో మరింత
పెద్దగా విస్తరించారు అనేది కొందరి వాదన.
ఈ సంఘటనల కన్నా ముందే భారత దేశానికి వచ్చిన హ్యుయాన్ త్సాంగ్.తాను దక్షిణ ప్రాంతం లో
పర్యటిస్తూ ఉన్నప్పుడు ఎన్నో బౌద్దారామాలు ఇతర ఆలయాలుగా మారడం గురించి ప్రస్తావించడం జరిగింది.
ఉండవల్లి వాటి బౌద్దుల గుహలు ఎలా హిందూ దేవత విగ్రహాలుగా మారాయో తెలుస్తుంది .అలాగే చాళుక్యుల ప్రారంభ
సమయం లో అనేక మంది భిక్షువుల మీద దాడులు జరిగాయని చాలమంది ప్రాణాలను కాపాడటం కోసం చైనా ,
శ్రీలంక, నేపాల్ ,శ్రీ విజయ వంటి రాజ్యాలకు పారిపోయారు.
శూద్ర కుల రాజులకు కూడా ప్రాధాన్యత ను ఇవ్వడం వారికి ఆయా దీక్షలను ఇవ్వడం వల్ల రాజ్యం మొత్తం ఆ
ప్రభావం కనబడింది. ఈ విధంగా హిందూ మతం పునరుజ్జీవం జరిగింది .
జైన , బౌద్ద విద్యాలయాల్లో అనేక వేల గ్రంథాలు రాయబఢ్ఢాయి ఇప్పటికీ కొన్ని మాత్రమే లభిస్తున్నాయి మన
ప్రాచీన చరిత్ర ను జైన, బౌద్ద గ్రంథాల ద్వారా నే తెలుస్తుంది. ఐతే చాల వరకు ఈ గ్రంథాలు కాల్చబడ్డాయి. మరియు
జైన, బౌద్ద మతాల సిద్దాంతాలు హిందూ మతం చే తస్కరించబడ్డాయి .
ఇక చివరగా ముస్లీం దండయాత్రల వల్ల వాయువ్య భారత దేశం లో బౌద్దానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటి
రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో జైనులను బలవంతం గా మతం మార్చారు వారిని
బలవంతంగా మాంసం తినిపించేవారు . కేరళ లో ఇప్పటికీ కాసర్గడ్, వాయనాడ్, అలప్పూజ లాంటి ప్రాంతాల్లో జైన
అవశేషాలను చూడవచ్చు.
ఇక భారత దేశ వ్యాప్తంగా యక్ష , బోధిసత్వ ప్రతిమలు అనేక దేవి దేవతలుగా విరాజిల్లుతున్నాయి. ఈ విధంగా
హిందూ మతం సుమారు 1200 సంవత్సరాల పాటు అనేక మార్పులు చేర్పుల వల్ల తిరిగి ప్రాణ ప్రతిష్ట జరిగి నేటికి
అలా కొనసాగుతుంది.
.
Comments
Post a Comment