తెలుగు నేలపై చివరి బౌద్ధ భిక్షువు కథ LAST BUDDHIST MONK ON TELUGU LAND
తెలుగు నేలపై చివరి బౌద్ధ భిక్షువు కథ
మనం ఈ విషయం తెలుసుకోవాలంటే ముందుగా వీర శైవ మత విజృంభణ కాలానికి మనం
ప్రయాణించాలి . వీర శైవ మతాన్ని చెన్న బసవేశ్వరుడు ప్రారంభించాడు .
మల్లికార్జున పండితుడు తానూ బుద్ధ పాదాచార్యుడు తో వాదిస్తానని ఆజ్ఞ ఇవ్వాలని రాజుగారిని
(వాస్తవానికి ఎలాంటి చర్చలు జరిగాయో పెద్దగా లిఖిత ఆధారాలు లేవు కానీ ఈ చర్చల
ఈయన ఒక సత్బ్రహ్మన కుటుంబం లో జన్మించినప్పటికీ వైదిక క్రతువులను, వేదాలను
వ్యతిరేకించి శివుడే దేవుడని , కాయమే కైలాసం అని తన భోధనలు చేసేవాడు. ఇతడి
మతాన్ని అప్పటి బ్రాహ్మణులు ఒక పాషండ మతంగా విమర్శించేవారు . ఐనప్పటికిని ఈ మతం
కన్నడ నేల పై విస్తరించింది ఎంతో మంది తెలుగు వారు కూడా ఆకర్షితులయ్యారు
ఈ సమయంలో నే తెలుగు ప్రాంతం లో మల్లికార్జున పండితుడు ఉండేవాడు . ఈయన
కూడా బ్రాహ్మణుడే బసవుని సిద్ధాంతాలకు మెచ్చి వీర శైవమతాన్ని ప్రచారం చేస్తాడు .వేదాలను ,
కుల వ్యవస్ధను మూఢనమ్మకాలను తొలగించడానికి ప్రయత్నిస్తాడు . కానీ ఆ తర్వాత అన్ని
విధాలా వైదిక క్రతువులను పాటిస్తూనే (యాగం , యజ్ఞోపవీత
ధారణా , సంధ్యావందనం , గాయత్రీ మంత్రం పఠనం ) తానూ కూడా బసవుడిలాగే
రాజ్యాధరణ తో పాటు ఒక గొప్ప గురువుగా ఎదగాలని కుతూహలం తో ఉండేవాడు. మెల్లిమెల్లిగా
తానూ ప్రచారం చేయడం సామాన్య ప్రజలు సైతం పాల్గొనడం జైనులను , బౌద్దులను పూర్తి
పరుషపద జాలం తో విమర్శించడం చేస్తుండే వాడు. వీర శైవానికి, ఆరాధ్య శైవానికి కూడా
వైరుధ్యాలు ఉన్నప్పటికినీ రెండు మతాల ఉద్దేశ్యం బౌద్ధ , జైన మతాలను నాశనం చేయడం
వంటి ఒకే సంకల్పం ఉండటం తో పెద్దగ ఘర్షణ పడ్డ సందర్భాలు తక్కవే అని చెప్పవచ్చు .
ఇక మల్లికార్జున పండితుడు శిష్యులతో పాటు వెలనాటి రాజైన 2 వ మహేంద్ర
చోళుని ఆస్థానం లోకి వస్తాడు . ఇక వారి రాజధాని ఐన కందవోలు నగరంలోనే శివాలయంలో
ఉంటాడు. ఇక ఇదే నగరం లో బుద్ధ పాదాచార్యుడు అనే బౌద్ధ గురువు ఇతర భిక్షువు లతో పాటు
ఉండేవాడు. ఇక్కడ పురాతన బుద్ద మహా విహారం ఉండేది . ఒకప్పుడు ఏంతో మంది బౌద్ధ
ఉపాసకులతో , విద్యార్థులతో ఉండిన ఈవిహారం ఆ కాలానికే కేవలం పదుల సంఖ్యల భిక్షువు తో
నే ఉంది . ఈ విహారం లో ఒక పెద్ద బుద్ధుడి విగ్రహం, కళ తప్పిన క్షేత్రం లా తయారయింది .
అక్కడ కేవలం ఒక వాడ లోని వారు మాత్రమే ఇంకా బౌద్దాన్ని అనుసరిస్తున్నారు .
ఎలాగైనా బౌద్ధ ధర్మాన్ని పునః స్థాపితం చేయాలనే దీక్షతో ఉన్నాడు బౌద్దా చార్యులు.
మల్లికార్జున పండితుడు తానూ బుద్ధ పాదాచార్యుడు తో వాదిస్తానని ఆజ్ఞ ఇవ్వాలని రాజుగారిని
అడుగుతాడు . ఈ విషయాన్ని బుద్ధ పాదాచార్యునికి సమాచారాన్ని పంపుతారు . అప్పటికి రాజు
ఆస్థానంలోని కొంత మంది బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నారు. . బుద్ధ పాదచార్యుడి తో వాదనలు
ప్రారంభమయ్యాయి . మల్లికార్జునుడు తన ఆరాధ్య శైవం విశిష్టతను చెబుతున్నాడు. ఇలా
జరుగుతున్న వాదం లో మల్లికార్జున పండితుడు విజయం సాధిస్తాడు.
(వాస్తవానికి ఎలాంటి చర్చలు జరిగాయో పెద్దగా లిఖిత ఆధారాలు లేవు కానీ ఈ చర్చల
గురించి తర్వాతి కాలాల్లో కొన్ని గ్రంథాలలో పేర్కొన్నారు కాని అందులో వాస్తవ కోణాలకు
బదులుగా మాయలు మర్మాలు ఎక్కువగా ఉన్నాయి .
కొన్ని వీర శైవ గ్రంథాలలో మరియు పండితారాధ్య చరిత్ర , శివ తత్వ సారము ,
రుద్రమహిమ వంటి గ్రంథాల ప్రకారం తమిళ నాడు లో సమ్మన్దార్ , తెలంగాణ ప్రాంతంలో దేవర
దాసామయ్య వంటి వారు జైనులని వదించారు అని తెలియజేయబడింది )
ఇక విజయం సాధించిన తర్వాత కూడా మల్లికార్జునుడి శిష్య గణం సంతోషంగా లేరు .
అందులో ఇద్దరు శిష్యులు ఎలాగైనా బౌద్ధ గురువును వధించాలనే ఆలోచన కు వస్తారు . వారు
ఉదయాన్నే బుద్ధపుర మహా విహారానికి వచ్చి అక్కడే ప్రార్థనలు చేస్తున్న బుద్దపాదా చార్యులను
చంపివేసారు . ఈ విషయం తెలుసుకున్న 2 వ మహేంద్ర చోళుడు ఏ తప్పు చేయకున్నా
మల్లికార్జునుడి కళ్ళు పీకివేస్తారని తర్వాత ఆయన ధ్యానం లో ఉండగా ఒక రోజు శివుడు
ప్రత్యక్షమై తిరిగి ఆయనకు కళ్ళు ప్రసాదిస్తాడని ఓ కథనం ప్రచారం లో ఉంది . తర్వాత ఆయన
శ్రీశైలం లో శివైక్యం అయ్యాడని ఓ కథ ప్రచారం లో ఉంది.
మరో గాధప్రకారం వాదం లో ఓడిన బుద్ధపాద చార్య శిష్యులను బౌద్దులను చంపివేస్తారని మరో
గాధ ప్రచారం లో ఉంది .కనుగుడ్ల ను తొలగించి నందుకు రాజును కూడా మల్లికార్జున పండితుడు
శపిస్తాడని రాజు కూడా కొద్దీ రోజులలోనే ఎదో జబ్బు తో చనిపోతాడని శైవ గ్రంథాలలో ఉంది . ఏది
ఏమైనప్పటికి ఉగ్రవాద భావాలైన వీర , ఆరాధ్య శైవా ల వల్ల చివరి బౌద్ధ సంగం మన తెలుగు
నేలపై నశించిపోయింది..
Comments
Post a Comment