Posts

#Aryan_invansion ఆర్యుల దండయాత్ర

#ఆర్యుల_దండయాత్ర_జరిగిందా_లేదా? ఈ ప్రశ్న అడగగానే ఒక భావజాలం వారు ఆ జరగలేదని, మరో వర్గం జరిగిందని చెబుతుంటారు. ఇప్పుడు వాస్తవ దర్శనం చేద్దాం --- ఆర్యుల రాక జరిగిన మాట వాస్తవం అందులో ఏ విధమైన దోషం లేదు. చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వీరివల్లే వర్ణ వ్యవస్థ వచ్చినది అని చెబుతారు. మరీ ఆర్యుల మాతృ ప్రాంతంగా ఊహించబడే జర్మనీ, ఇరాన్, సైబీరియా, మద్య ఆసియా ఇలా చాలా ప్రాంతాల మూల నాగరికత ల్లో వర్ణ వ్యవస్థ ఉన్నట్లు కనబడదు. అంటే ఆర్యులు ఇక్కడికి వచ్చాకే మలి వేద నాగరికత కాలం లో ఈ జాడ్యం మరింత పెరిగిందని మనం చూడాల్సిన విషయం. #ఉత్తరభారతీయులందరూ_ఆర్యులనా? చాలా మంది ఉత్తర భారతీయులందరిని ఆర్యులని దక్షిణ ప్రాంతం లోని వారిని ద్రావిడులుగా పరిగణించడం కూడా తప్పే. ఎందుకంటే ఆర్యులు ముందుగా ప్రస్తుత పాకిస్తాన్, ఆఫ్ఘన్ లోని కొన్ని ప్రాంతాల నుంచి మొదలు పెడితే పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, దైమాబాద్ (మహారాష్ట్ర) వరకు స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారని తెలుస్తుంది. అంటే ఇప్పటి పాకిస్తాన్, భారత్ లోని వాయువ్య భాగాల్లొని వి వీరి యొక్క మెజారిటీ ప్రాంతాలు. ఐతే చాలా వరకు వీరి అప్పటి ...

తెలుగు నేలపై చివరి బౌద్ధ భిక్షువు కథ LAST BUDDHIST MONK ON TELUGU LAND

                                                  తెలుగు నేలపై చివరి బౌద్ధ భిక్షువు కథ            మనం ఈ విషయం తెలుసుకోవాలంటే ముందుగా వీర శైవ మత విజృంభణ కాలానికి మనం  ప్రయాణించాలి .  వీర  శైవ మతాన్ని చెన్న బసవేశ్వరుడు ప్రారంభించాడు .        ఈయన ఒక సత్బ్రహ్మన కుటుంబం లో జన్మించినప్పటికీ   వైదిక  క్రతువులను , వేదాలను  వ్యతిరేకించి శివుడే దేవుడని , కాయమే   కైలాసం అని తన భోధనలు చేసేవాడు. ఇతడి  మతాన్ని  అప్పటి బ్రాహ్మణులు ఒక పాషండ మతంగా విమర్శించేవారు . ఐనప్పటికిని ఈ మతం  కన్నడ నేల పై  విస్తరించింది ఎంతో మంది తెలుగు వారు కూడా ఆకర్షితులయ్యారు       ఈ సమయంలో నే తెలుగు ప్రాంతం లో మల్లికార్జున పండితుడు ఉండేవాడు . ఈయన  కూడా  బ్రాహ్మణుడే  బసవుని సిద్ధాంతాలకు మెచ్చి వీర శైవమతాన్ని ప్రచారం చేస్తాడు .వేదాలను , కుల వ్యవస్ధను మూఢనమ్మకాలను...

#హిందూ_మత_పునరుజ్జీవనం REVIVAL OF HINDUISM IN TELUGU

                                                      హిందూ మత పునరుజ్జీవనం                   బౌద్ధ, జైన మతాలు అంతరించిన తర్వాత హిందూ మతం తిరిగి ఆధ్యాత్మిక పరంగా , ఆచారాల వ్యవహారాల రీత్యా , రాజకీయ పరంగా తిరిగి  తన అస్థిత్వాన్ని పొందింది అని చెప్పవచ్చు . ..... ఐతే ఇది ఎలా జరిగింది ? ........ దీని వెనక ఏం  జరిగింది ? ...... జైన , బౌద్ధ మతాలు  ఏ తమ స్థానాలను ఎలా కోల్పోయాయి ?                        ఇలా ఎన్నో వందల కొద్దీ ప్రశ్నలు మన మెదళ్ల లో తిరుగుతుంటాయి .  ఐతే ఈ విషయంలో లోతుకు  వెళ్తే  జైనం , బౌద్ధ మతాలు  వైదిక , బ్రాహ్మణ భావ జాలానికి వ్యతిరేకంగా ఏర్పడ్డాయి. ఆ కాలానికి బ్రాహ్మణులు  ఆర్థికంగాను సమాజంలో ఎంతో పరపతి తోనూ ఉండేవారు. తమని తాము భూమి పై నడయాడే దేవుళ్ల గానూ, కనబడే  దేవుళ్లు గానూ చెప్పుకున్నారు. దీ...

#MASSACRES_OF_RELIGIONS మతాలఊచ కోతలు

Image
                                                                మతాల ఊచ   కోతలు                                                           MASSACRES OF RELIGIONS                                                       నేను ఏ దేవాలయాన్ని సందర్శించిన ఆ ఆలయ ప్రాశస్త్యం కొన్ని యుగాల నుంచి ఉందని పండితులు చెప్పేవారు. కాని ఆలయ నిర్మాణాలు మాత్రం నిర్మాణం వాస్తుశైలి మాత్రం ఎక్కువగా 7 వ శతాబ్దం నుంచి 14 వ శతాబ్దం మధ్యలో ఉండేవి (ఇంకా ఖచ్చితంగా అంటే 11-13 శతాబ్దం ల మధ్యలో) ఇలా వీటి నిర్మాణం ఎందుకు ఈ సమయాల్లోనె ఎందుకు జరిగింది అని తెలుసుకోగా?     ...
                                                        సోమదేవుని యశస్థిలకము                    సోమదేవసూరి రచించిన యశస్థిలకం  9-10 వ శతాబ్దపు మత , సామాజిక , ఆర్ధిక , పరిపాలన పరమైన, ప్రజల ఆహార అలవాట్ల మీద కూడా వివరంగా కూలంకషంగా చర్చించబడింది .       ఐతే ఈ గ్రంథం గురించి కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది .                      సోమదేవసూరి ప్రసిద్ధ జైన మతాచార్యులు ఆనాటి కాలంలో ఈయన పరమార రాజ్య , వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో పనిచేసిన వారు ఈయన . 2 వ అరి కేసరి తర్వాత రాజైన వాగ రాజు ఆస్థానంలో ఉన్నాడు మరియు 2 వ బద్దెగుడి విద్యా గురువు సోమదేవుడు. అనగా ఈయన వాగరాజు, 2వ బద్దెగుడు , 3వ అరికేసరి  కాలం వాడు . ఇతని బిరుదులు: తార్కిక చక్రవర్తి , కవికుల రాజు ,శాద్వదాచాల సింహ , వాక్కల్లోల పయోనిధి ఇతని  రచనలు: ...

#Ganpati

Image
 హైదరాబాద్ లో  ఇక్రిశాట్ నిర్మాణం లో భాగంగా బయటపడిన 👉. తొలినాళ్ల ల్లో గణపతి కి కిరీటం,ఆభరణాలు ఉండేవి కావు . అటువంటి గణపతి తొలి విష్ణుకుండినులు పాలించిన ప్రస్తుత అమ్రాబాద్ (అమరపురి, నల్లమల్ల) ప్రాంతంలో ఉండేదని చెబుతారు. తదనంతర కాలం లో గణపతి విశ్వవ్యాపితం అయ్యి ఈ నాటి రూపానికి, మరియు విభిన్న మైన  సాధన స్తితికి గణాపత్యమ్ ఎదిగింది.  13 వ శతాబ్దం కాలం నాటికి సరిగ్గా మహారాష్ట్ర లో భక్తి ఉద్యమం వ్యాపించింది.          అప్పటికి మహారాష్ట్ర లో - మరాఠీ భాష కావ్య,గేయ రూపాల్లో, మరి కొన్ని గ్రంథ రూపాల్లో ఎదుగుతుంది. -శైవ, వైష్ణవుల మధ్య  వైరుధ్యాలు తగ్గాయి. (గణపతి ఆరాధన అనేది ఈ 2 శాఖ ల మధ్య వివాదాలను తగ్గించింది. ప్రస్తుత తమిలనాడులో ఎంతో మార్పును తీసుకువచ్చిన  గణపతి ఆరాధన మహారాష్ట్రం లో కీర్తి సింహం మీద ఆసిన్నమైంది.) -అష్ట వినాయక ఆలయాలు అభివృద్ది  జరగడం.   ఈ విధంగా మరాఠీ లో కొన్ని జానపద గీతాలు, పాటలు వినాయకుడి పేరు మీద వెలువడ్డాయి.    అది భారత దేశ అతి వాద స్వాతంత్య్ర  సంగ్రామం లో  ఎంత గానో ఉపయోగపడ్డాయి. ఈ నాటికి ఆ పరం...
Image
                                                                              ఖట్వాంగ  ఖట్వాంగలు తాంత్రిక  వామాచార పరంపర సంస్కృతులలో మనకు ఎప్పుడు కనిపించే వస్తువులు. ఇవి ఆయా శాఖల్లో ప్రముఖ పాత్ర వహిస్తాయి. మనం ఇది వరకు మాట్లాడుకున్నట్టు అంకుశం కూడా ఒక చిహ్నం గా గుర్తించాం.       కానీ ఈ ఖట్వాంగలు మనం చెప్పుకునే  జానపద కథల్లో ఉండే మంత్ర దండాల?  లేదా ఆ శాఖల సంకేతాల  అనేవి నాకు తెలియడం లేదు.     ఇవి మాత్రం కొన్ని నమూనాలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వజ్ర ఖట్వాంగ కపాల ఖట్వాంగ త్రిశూల ఖట్వాంగ అంకుశ ఖట్వాంగ ఖడ్గ ఖట్వాంగ అగ్ని  ఖట్వాంగ    పల్లవుల యొక్క ధ్వజ చిహ్నంగా ఇది ఉన్నట్టు తెలుస్తుంది.  ( Google images)

బౌద్ధమత గ్రంథాలు

Image
                                                                    బౌద్ధమత   గ్రంథాలు      చాలా మంది బౌద్ధ పరిశోధకులకి లేదా ఆసక్తి ఉన్నవారికి బౌద్ధ గ్రంథాల మీద అవగాహన లేక  మార్కెట్లో కొన్ని పుస్తకాలు కొని ఎవరో కొందరు తాము సొంతంగా రాసుకున్న భావజాలాన్ని ఆ పుస్తకాల ద్వారా ఇతరులకు రుద్దుతారు అందువల్ల ఈ క్రింద అనేక  బౌద్ధ ప్రామాణిక గ్రంథాల  పేర్ల ని ఇవ్వడం జరిగింది గమనించగలరు .  త్రిపీఠకాలు (ఇవి బౌద్ధ మత  గ్రంథాలు ఇవి 3 గా విభాజితం ఐ ఉన్నాయి వరసగా ) సుత్త పీఠిక  వినయ పీఠిక  అభిధమ్మ పీఠిక    ఈ పీఠకాలలో మొదటిదైన సుత్త పీఠిక చాలా పెద్దది  ధమ్మపదం (ఖుద్దక నికాయ) దీనిలో అంతర్భాగం . ఇందులో 5 నిఖాయాలు ఉంటాయి  దీఘా నికాయ  మజ్జమ నికాయ  సంయుక్త నికాయ  అంగుత్తర నికాయ  ఖుద్దక నికాయ ( ఇది మొత్తం 15 భాగాలు ఉంటాయి . ) ఖుద్దక పా...
Image
                                                                అంకుశం   అంకుశం చూడటానికి అలంకరణతో కనపడే ఈ పరికరం పెద్ద పెద్ద జంతువులని నియంత్రించడానికి వాడతారు . చూడటానికి భిన్న భిన్న ఆకృతులతో చూడటానికి అందంగా కనిపించే ఇది ఒక బలమైన ఆయుధం . ఏనుగు , ఒంటె లాంటి పెద్ద జంతువులను కూడా ఇది బాధపెట్టగలదు .               పురాతన కాలం నుండి ఆయా ప్రాంతాల్లో  మద గజాన్ని  అంకుశం అంకుశం సహాయం తో దాని గర్వాన్ని అణిచి దానిని నియంత్రించి  దానిమీద ఆసీన్నులు అయ్యే క్రీడ కూడా ఉండేది . అలాంటి క్రీడలు తలచుకుంటేనే ఎంతో బాధాకరంగా ఉంటుంది .                      ఐతే ఈ అంకుశాన్ని ధరించే దేవతలు , యక్షులు కూడా ఉన్నారు ఇవి ఆయా సమూహాల్లో   ఇవి ప్రముఖ స్థానాన్ని సంపాదించి ఉన్నాయి . ఐతే ప్రధానంగా  మన గర్వాన్ని , అహంకారాన్ని, రాగ ,...

సంత్ సేవాలాల్ మహారాజ్| sant sevalal maharaj telugu

Image
                                                  సంత్ సేవాలాల్ మహారాజ్  ఈ సుదీర్ఘ కాలగమనం లో రాజపుత్రుల వారసత్వ తేజస్సును ఇనుమడింపచేసుకొని  కొన్ని ఎత్తు పల్లాలను చవిచూసిన జాతి బంజారా జాతి . ఐతే 17 వ శతాబ్ద కాలం లో ఇటు బ్రిటిషు వారి నుంచి ఇతర రాజ్యాల లో యుద్ధవీరులుగా , సైనికులుగా పనిచేసేవారు ఈ బంజారాలు . వీరిని స్థానికంగా లంబాడీలు అని పిలుస్తారు . సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే  బంజారాల జీవన విధానంలో ఉన్నతిని తీసుకురావడానికి , స్వయం సమృద్ధి , ఆత్మగౌరవం , సంస్కృతిని  ఇలా అన్ని విషయాల్లో సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తియే "సంత్ సేవాలాల్ "                                                 సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15 న జన్మించారు ఈయన బాల్యం కర్ణాటక , ఆంద్ర సరిహద్దుల్లోని గడిచింది . ఈయన తండ్రి పేరు భీమా నాయక్, తల్లి పేరు ధ...
Image
                                                    యక్షులు ఎవరు ?  మన దేశం ఎన్నో వేల సంవత్సరాల చరిత్రను తనలో ఇముడ్చుకున్నది . పురాతన భారాతావనిలో కూడా కొన్ని గణాల గురించి  పురాతన  గ్రంథాల్లో చెప్పబడి ఉన్నది .  సప్త గణాలు - ఋషులు , గంధర్వులు , నాగులు,అప్సరసలు , యక్షులు,దేవతలు మరియు రాక్షసులు   చాలా పురాణాల్లో యక్షులను దట్టమైన అరణ్యాలలో ,నదుల,సరస్సుల ప్రవాహక ప్రాంతాల్లోనో , లోయల ప్రాంతాల్లో ఉండేవారని చెబుతున్నాయి. వారు మంచి శరీర పుష్టి కలిగి అందంగా ఉండేవారని తెలుస్తుంది . వీరి గురించి హిందూ , జైన ,బౌద్ధ మత సాహిత్యాల్లో కూడా చెప్పబడి ఉంది . యక్షుల రాజు కుబేరుడు ఈయన సంపదకు ప్రభువుగానూ ,శివుడిని యక్షమూర్తి గాను కొన్ని గ్రంథాలు తెలుపుతున్నాయి . వేదాలలో కూడా యక్షుల ప్రస్తావన ఉన్నది . యక్షులు  రక్షకులుగానూ మరియు భక్షకుల గానూ కొన్ని గ్రంథాల్లో ఉంది . పురుషులను  యక్షుడు అని స్త్రీ లని యక్షిని లు అని పిలుస్తారు .  సంస్కృతం ల...

ACHARYA BUDDHAGHOSA/ ఆచార్య బుద్ధఘోష

Image
                                                                        ఆచార్య బుద్ధఘోష                    భారత దేశ ఆధ్యాత్మిక ప్రవాహం లో 7  శతాబ్దం నుంచి కొన్ని మార్పులు రావడం జరిగింది.  సుమారుగా 3 వ శతాబ్దం నుంచి మహాయాన బౌద్ధం విస్తృత ఆదరణ పొందినది. తర్వాతి కాలంలో 5 వ శతాబ్దం కాలానికి వచ్చే సరికి  చాలా వరకు రాజులు మహాయానాన్ని అనుసరించడం లేదా పోషించడం చేసేవారు . సరిగ్గా థేరవాద బౌద్ధ పండితులు ఒక పెద్ద సందిగ్ధం లో పడిపోయిన కాలం అది మహాయాన బౌద్ధ సాహిత్యం ప్రబలంగా  జనబాహుళ్యం లోకి వెళ్లడం సంస్కృత సూత్రాల ఉచ్చారణ  బౌద్ధం లో చోటుచేసుకున్న గాథలు వంటివి హీనయాన శాఖ వారికి మింగుడు పడని అంశం తిరిగి  ప్రాభవం పొందాలని చాలా మంది హీనయాన భిక్ఖుల ఆలోచన వీరి ఆలోచన ని కార్యరూపం దాల్చడానికి కారకులే  బుద్ధఘోష .          ...